ప్రకాశం: బల్లికురవ మండలంలోని ఉప్పుమాగులూరు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి కుమారి నిర్వహించారు. సందర్భంగా ఆమె రైతులతో కలిసి గ్రామంలోని వంటి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం పొలాల్లో ఉన్నటువంటి తెగులు నివారణకు పలు సూచనలు చేశారు. రైతులు ప్రతి ఒక్కరూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
AP: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. వాట్సాప్ గవర్నన్స్‌పై కాన్ఫరెన్స్‌లో కీలక చర్చ జరిగింది. ప్రభుత్వ సమాచారం అంతా ఒకే చోట ఉండేలా వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దుతామని తెలిపారు. వాట్సాప్ ద్వారా 153 సేవలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని..10 రోజుల్లో ఈ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ విధానాన్ని రీఇంజనీరింగ్ చేయాల్...
NLR: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు దుత్తలూరు సీడ్స్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మండల స్థాయిలో ఈనెల 15న కావలి, నెల్లూరు 22న కందుకూరు, ఆత్మకూర్ డివిజన్ల పరిధిలోని మండలాలలో నిర్వహించి ఈనెల 29న దుత్తలూరులో ఫైనల్ పోటీలు నిర్వహిస్తామన్నారు.

TG: కేసీఆర్, తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగానే తెలంగాణ వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడా కనిపించలేదన్నారు. ఉద్యమం గురించి రేవంత్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు.

TPT: ఏర్పేడు మండలం విక్రతమాలలో బుధవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారుల ద్వారా సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.
ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్‌పై ఆ జట్టు మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాక్స్‌వెల్‌కు టెస్ట్ టీంలో ఉండే అర్హత లేదన్నాడు. కాగా మ్యక్సీ టెస్ట్ ఫార్మాట్‌లో ఆడి దాదాపు ఏడేళ్లు అవుతోంది. తన చివరి టెస్ట్ 2017లో బంగ్లాదేశ్‌లో ఆడాడు.
KKD: ఈనెల 14న జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికలకు బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ షన్మోహాన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సాగునీటి సంఘాలకు రెండు అంచెల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. 14న అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 17న డిస్ట్రిబ్యూషన్ కమిటీకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ప్రకాశం: ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వ్యవసాయ అధికారులు ఫారుక్ హాజరయ్యారు. మొక్కజొన్న కంది పంటలో యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. వరి పంటకి మానికాయ వచ్చే అవకాశం ఉందని, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
CTR: కూటమి ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13న రాయచోటిలో నిర్వహించే ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వైసీపీ శ్రేణులు హాజరుకావాలని ఆయన కోరారు. ఉదయం 9:30 గంటలకు రాయచోటి బస్టాండ్ సమీపంలోని వైసీపీ కార్యాలయానికి చేరుకోవాలని చెప్పారు.
NLR: R&B రోడ్డు, పంచాయతీ రోడ్డు, నేషనల్ హైవే రోడ్లపై దమ్ము చక్రాలు బిగించిన ట్రాక్టర్లు రాకపోకలు నిషేధమని ఆత్మకూరు ఆర్టీవో రాములు తెలిపారు. నెల్లూరు జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు ట్రాక్టర్లకు ఇనుప చక్రాలతో రోడ్డుపైకి వస్తే రవాణా ట్రాన్స్‌పోర్ట్ చట్టాల కేసులు నమోదు చేస్తామని రైతులకు సూచించారు.
NRML: నిర్మల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో పదవ తరగతి విద్యార్థులకు బుధవారం నిర్వహించిన గణిత ప్రతిభ పోటీలు ముగిసాయి. ఆయా మండలాల నుండి వచ్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీలలో పాల్గొని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ సిద్ధపద్మ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకే గణిత పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
NLG: ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి పూర్తిగా విరుద్ధమని, తీవ్రంగా వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు అన్నారు. SC వర్గీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ బుధవారం NLG కలెక్టరేట్‌కి రాగా కమిషన్ ఛైర్మన్‌కు మాల మహానాడు ఆధ్వర్యంలో వర్గీకరణను వ్యతిరేకిస్తూ వినతి పత్రం అందజేశారు.