• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వివాహం వేడుకల్లో సందడి చేసిన మంత్రి సీతక్క

MLG: మంత్రి దనసరి అనసూయ(సీతక్క) వద్ద పనిచేసే క్రాంతికుమార్ వివాహ వేడుక ఈరోజు గోవిందరావుపేట మండలంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వారికి చిరుకానుక అందజేశారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ తదితరులున్నారు.

December 11, 2024 / 05:42 PM IST

BIG ALERT: నేడు, రేపు భారీ వర్షాలు

AP: నైరుతి-ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో శ్రీలంక, తమిళనాడు తీరాలవైపు పయనించే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అనంతరం వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఇవాళ, రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడి...

December 11, 2024 / 05:42 PM IST

వివాహా వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు

KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ముత్యపు రాఘవులు పెంటయ్య ఫంక్షన్ హాల్లో మండ్రు వారి వివాహ వేడుకలో బుధవారం పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ చింతల, సాయిబాబా ఆశ మొల్ల, శ్రీనివాస్ నాగం తదితరులు పాల్గొన్నారు.

December 11, 2024 / 05:41 PM IST

కోదాడ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఐజీ

SRPT: కోదాడ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లను బుధవారం ఐజీ సత్యనారాయణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ రవాణాలను నివారించడం కోసం పటిష్టంగా ఉండాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయం రానున్న సందర్భంగా సరిహద్దు ప్రాంత అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ అక్రమ రవాణాను అరికట్టాలని అన్నారు.

December 11, 2024 / 05:40 PM IST

కేరళ ప్రజలకు అండగా నిలబడాలి

SKLM: కేరళ ప్రజలకు అండగా నిలవాలని సీఐటీయూ జిల్లా సినీయర్ నాయకులు కె.శ్రీనివాసు అన్నారు. శ్రీకాకుళంలో సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బుధవారం కేరళ సంఘీభావ సభను జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు అధ్యక్షతన సీఐటీయూ, అఖిల భారత కిసాన్ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రజలందరూ ఖండించాలన్నారు.

December 11, 2024 / 05:38 PM IST

స్వచ్ఛ సిద్దిపేట లక్ష్యం: కమిషనర్

SDPT: స్వచ్ఛ సిద్దిపేట తమ లక్ష్యమని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు. సిద్దిపేట పట్టణంలో ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రజలంతా తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. అంతే కాకుండా మున్సిపల్ పరిధిలో మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని ఆయన తెలిపారు.

December 11, 2024 / 05:37 PM IST

‘రోహిత్ vs బుమ్రా.. కెప్టెన్సీలో అదే తేడా’

పింక్ బాల్ టెస్టులో ఘోర పరాజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుమ్రా కెప్టెన్సీతో పోల్చుతూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్సీలో రోహిత్ శర్మ దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉందని ఆసీస్ మాజీ బ్యాటర్ సైమన్ కటిచ్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా బౌలింగ్ విభాగం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నాడు. తొలి టెస్టు విజయానికి, రెండో టెస్టు ఓటమికి మధ్య తేడా బౌలింగ్ విభాగమ...

December 11, 2024 / 05:36 PM IST

నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్ష ఎన్నికలు

WGL: గ్రేటర్ వరంగల్ నాయి బ్రాహ్మణ సంగం అధ్యక్ష ఎన్నికలు నేడు ఎల్‌బీ నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో హడ్ హక్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్యాలెట్ ద్వారా నిర్వహించారు. అధ్యక్ష పీఠానికి ముగ్గురు సభ్యులు పోటీపడగా ఉదయం నుండి జరిగిన ఓటింగ్‌లో 730 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో కస్తూరి సతీష్ 388, బాలు 240, మేడిపల్లి కర్ణాకర్ 66 ఓట్లు పడగా, కస్తూరి సతీష్ 148 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు.

December 11, 2024 / 05:35 PM IST

గ్రామంలో పర్యటించిన ఎంపీపీ, ఎంపీడీవో

ASR: కొయ్యూరు మండలం పాడి గ్రామంలో బుధవారం ఎంపీపీ రమేష్, ఎంపీడీవో ప్రసాద్ పర్యటించారు. గ్రామంలో పలువురు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పలువురిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి నమూనాలను సేకరించి, పరీక్షలకు పంపించాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈని ఆదేశించారు.

December 11, 2024 / 05:32 PM IST

‘కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుంది’

JGL: విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుందని మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు. బుధవారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయారన్న విషయం తెలుసుకుని హాస్పిటల్‌కి వెళ్లి వారిని పరామర్శించారు.

December 11, 2024 / 05:31 PM IST

మంచినీటి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు

HYD: గౌలిపుర డివిజన్ పరిధిలో జలమండలి అధికారులతో డివిజన్ కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మి పర్యటించారు. డివిజన్ పరిధిలో చాలా ప్రాంతాల్లో మంచినీటి సరఫరా సమస్యలు ఉన్నాయని స్థానికులు… కార్పొరేటర్ దృష్టికి తెచ్చారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు. మరోసారి సమస్యలు రాకుండా మరమ్మతులు చేపట్టాలని సూచించారు.

December 11, 2024 / 05:31 PM IST

‘సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి’

KDP: బీ.కోడూరు మండలంలోని ఐత్రంపేట గ్రామంలో బుధవారం చేపట్టిన రెవెన్యూ సదస్సులో బద్వేల్ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో భూ సమస్యలతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, భూ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వెంటనే పరిష్కార దిశగా కృషి చేస్తామన్నారు.

December 11, 2024 / 05:31 PM IST

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’

ADB: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ సోయం బాపురావును జిల్లా కాంగ్రెస్ నాయకులు బుధవారం పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందజేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలు, తదితరాంశాలపై వారితో చర్చించారు.

December 11, 2024 / 05:30 PM IST

వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: మంత్రి పొంగులేటి

TG: వరంగల్‌ నగరాభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్‌ భద్రకాళి చెరువు, విమానాశ్రయం తదితర అంశాలపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు పనులు యుద్ధప్రాతిపదికన జరపాలని, ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమీక్షలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు నరేందర్&...

December 11, 2024 / 05:30 PM IST

శిక్షణా తరగతులలో పాల్గొన్న ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి

NRPT: ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి బుధవారం హైద్రాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కేంద్రంలో ఎమ్మెల్యేలకు నిర్వహించిన శిక్షణా తరగతులలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడాలి, సభ విధివిధానాలు, బిల్లులు, తీర్మానాలపై శిక్షణ ఇస్తారని ఎమ్మెల్యే చెప్పారు.

December 11, 2024 / 05:29 PM IST