• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆంజనేయ స్వామి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తీగపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమనికి బుధవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వహకులు ఎమ్మెల్యే శంకర్‌ను సన్మానించారు.

December 11, 2024 / 06:29 PM IST

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై శిక్షణా తరగతులు

ATP: పామిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో తేజోష్ణ ఆధ్వర్యంలో స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై గ్రామ సర్పంచులకు, మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన, పర్యావరణ సుస్థిరత, సామాజిక సమానత్వం పై శిక్షణ ఇచ్చామన్నారు.

December 11, 2024 / 06:27 PM IST

మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ ఫైర్

ప్రధాని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. తమ స్నేహితుల కోసం కేంద్రం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరుగా వినియోగించడం ఇకనైనా ఆపాలన్నారు. ప్రజలందరీ కోసం ప్రభుత్వ బ్యాంకులు పని చేయాలని సూచించారు. కానీ ప్రభుత్వం వాటిని ధనిక, శక్తివంతమైన సంస్థలకు ప్రైవేట్ ఫైనాన్షియర్లుగా మార్చేశాయని విమర్శించారు.

December 11, 2024 / 06:25 PM IST

జాయింట్ కలెక్టర్‌తో భేటీ అయిన ఎమ్మెల్సీ

W.G: ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్‌కి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. టీచర్స్ అలాగే ప్రజా సమస్యలపై పోరాడాలని ఎమ్మెల్సీకి సూచించారు.

December 11, 2024 / 06:21 PM IST

రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. చేతకాని సీఎంను తెలంగాణ నెత్తిన రుద్దారని పేర్కొన్నారు. తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే రాహుల్ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. నమ్మి అధికారమిస్తే అస్థిత్వాన్ని దెబ్బతీస్తారా అని ప్రశ్నించారు. గ్యారెంటీలకు దిక్కులేదు, 420 హామీలకు పత్తా లేదు, డిక్లరేషన్లకు అడ్రస్ లేదన్నారు.

December 11, 2024 / 06:20 PM IST

కళాశాల అభివృద్ధికి కృషి చేస్తాం: MLA

కోనసీమ: కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరిస్తామని MLA బండారు సత్యానందరావు తెలిపారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ కళాశాల వసతుల కల్పన, సమస్యల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను పిలిపించి 3 పేస్ విద్యుత్తు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

December 11, 2024 / 06:20 PM IST

మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

ప్రకాశం: చీరాలలోని విజిలిపేట నందు బుధవారం ముగిరి క్రాంతి కుమార్ అనే వ్యక్తి అక్రమంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నాడని సమాచారంతో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. అతని వద్ద నుంచి 9 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అతని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

December 11, 2024 / 06:20 PM IST

సిరాజ్‌ గురించి ఆందోళనకు గురయ్యా: రికీ పాంటింగ్

అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో సిరాజ్- హెడ్‌ల మధ్య వాగ్వాదం హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. ‘హెడ్ వికెట్ తీసినప్పుడు సిరాజ్ సంబరాలు చేసుకున్నాడు. అతడు ఇచ్చిన సెండాఫ్‌ను చూశా. అప్పుడు నాకు సిరాజ్ గురించి ఆందోళన మొదలైంది. బ్యాటర్లకు డ్రెస్సింగ్ రూమ్‌ను చూపిస్తూ సెండాఫ్‌లు ఇవ్వడం రిఫరీ, అంపైర్లకు నచ్చ...

December 11, 2024 / 06:19 PM IST

ఈనెల 14న నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు

ASR: ఈనెల 14వ తేదీన జిల్లాలో నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ బుధవారం తెలిపారు. అనంతగిరి, అరుకు, డుంబ్రిగుడ, హుకుంపేట, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జి.కె.వీధి, కొయ్యూరు, రంపచోడవరం, దేవీపట్నం, గంగవరం, రాజవొమ్మంగి, వై.రామవరం, మారేడిమిల్లి, అడ్డతీగల మండలాల్లో ఉన్న 84 నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

December 11, 2024 / 06:19 PM IST

ఘనంగా భారతీయ భాషా ఉత్సవ్ కార్యక్రమం

NLR: ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు ప్రభుత్వ డైట్‌లో బుధవారం భారతీయ భాషా ఉత్సవం ఘనంగా నిర్వహించబడినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలియజేశారు.మొదట సుబ్రహ్మణ్య భారతి చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన యొక్క జీవిత విశేషాలను, ఆయన సమాజానికి చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

December 11, 2024 / 06:18 PM IST

జాతీయ అవార్డు అందుకున్న మేదిని ప్రకాష్

HNK: జిల్లా కేంద్రంలో నేడు మేదిని ప్రకాష్‌కు జాతీయ పర్యావరణ అవార్డును నిర్వాహకులు అందజేశారు. మొక్కల సంరక్షణలో విశేషంగా పాటుపడుతున్న ప్రకాష్ కృషిని గుర్తించి మానవ హక్కుల కమిషన్ సభ్యులు జాతీయ అవార్డును అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు శ్రీనివాస్ శాలువా కప్పి అవార్డుతో మేదిని ప్రకాష్‌ను అభినందించారు.

December 11, 2024 / 06:17 PM IST

‘మౌన దీక్షతో నిరసన తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగులు’

ADB: సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ పట్టణంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులు నోటికి గుడ్డ కట్టుకొని మౌన దీక్షతో నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారన్న హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

December 11, 2024 / 06:16 PM IST

త్రాగునీటి కష్టాలు తీర్చాలని గ్రామస్థుల ఆవేదన

NRML: బాసర మండలం కిర్గుల్ (కె) గ్రామంలో గత నాలుగు రోజుల నుండి త్రాగునీరు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బుధవారం గ్రామస్తులు మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా త్రాగునీరు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని, అధికారులకు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి త్రాగునీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

December 11, 2024 / 06:15 PM IST

బాలకృష్ణ ‘అఖండ 2’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సీక్వెల్ రూపొందిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ రెగ్యులర్‌ షూటింగ్‌ నేడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ తేదీని ప్రకటించారు. 2025 సెప్టెంబరు 25న సినిమాని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

December 11, 2024 / 06:14 PM IST

భాకరాపేట రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

CTR: భాకరాపేట నుంచి ఎలమంద రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే పులివర్తి నాని బుధవారం పరిశీలించారు. రోడ్డు పనులలో నాణ్యత పాటించి సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు తెలిపారు. మెరుగైన రవాణా సౌకర్యాల కోసం రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

December 11, 2024 / 06:11 PM IST