ADB: యోగాతో మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం సైతం కలుగుతుందని ఆయుష్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రాథోడ్ ప్రీతల్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుధవారం యోగా కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు యోగా చేయటం వలన జీవనశైలి మెరుగుపడటంతో పాటు అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు. యోగాను జీవితంలో ఓ భాగంగా చేసుకోవాలని సూచించారు.
NLG: MG యూనివర్సిటీలో బిజినెస్ మెనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో యువ అధ్యాపకులకు, పరిశోధకులకు రీసెర్చ్ మెథడాలజీపై 10 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి బుధవారం తెలిపారు. కేవలం 30 మందికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
NLR: నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని హోటళ్లు, హాట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ సూర్య తేజ అన్నారు. ఆహార నాణ్యతా ప్రమాణాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగం, నగరపాలక హెల్త్ విభాగం కలిసి నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహకులకు అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు.
SRCL: విద్యాలయంలో మత ప్రచారం చేసేందుకు యత్నించిన ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ లింగాల రాజును సస్పెండ్ చేస్తూ డీఈఓ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ మతానికి సంబంధించిన కరపత్రం, ఇతర సామాగ్రి విద్యార్థులకు పంపిణీ చేశారు.
MDK: జిల్లాలో నార్సింగిలో విషాదం నెలకొంది. కారు ఢీకొన్న ఘటనలో భర్త ముందే భార్య మృతి చెందిన విషయం తెలిసిందే. చనిపోయిన లక్ష్మి మూడవ రోజు కార్యక్రమం సందర్భంగా బంధువులు అందరూ స్నానం కోసం చెరువులోకి వెళ్లారు. స్నానానికి వెళ్లిన దుర్గయ్య(మృతురాలి మామయ్య) తిరిగి రాకపోవడంతో బంధువులు చెరువులో వెతకగా మృతదేహం దొరకడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో నేడు బాంబు స్క్వాడ్ సిబ్బంది జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తచర్యగా తనిఖీలు చేపట్టాలని సీపీ ఆదేశించారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలో తనిఖీలు చేపట్టారు.
SRD: నారాయణఖేడ్ డివిజాన్‌లో గంజాయి, మాదకద్రవ్యాలపై పోలీసులు ఒక్క పాదం మోపాలని ఎస్పీ రూపేష్ సూచించారు. నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పోలీసు సిబ్బంది స్థానికంగా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పారు. స్టేషన్‌కి వచ్చే వారితో మర్యాదగా మాట్లాడాలని సూచించారు.
CTR: రేపు గంగవరం మండలంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం సాయంత్రం తెలిపింది. ఈ సందర్భంగా మండలంలో జరిగే రెవెన్యూ సదస్సులలో పాల్గొంటారని చెప్పారు. ఉదయం 9:30 గంటల నుండి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి అధికారులు, రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నట్లు తెలిపారు.
PPM: సకాలంలో టీకాలు చిన్నారులకు వేయాలని, జాప్యం ఉండకూడదని జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్ రావు అన్నారు. పార్వతీపురం మండలం చొక్కాపువాని వలస గ్రామాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిడ్డ పుట్టినప్పటి నుండి 24 గంటల్లోపు, 6, 10, 14 వారాలు, 9 నెలలు 16నుండి 24నెలలు, 5 సం.వయసులో టీకాలు షెడ్యూల్ ప్రకారం వేయాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు.
NZB: రాష్ట్ర ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పీ.మల్లారెడ్డిని రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సంఘానికి ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఒలంపిక్ సంఘం మాజీ కార్యదర్శి జగదీష్ యాదవ్, సాఫ్ట్ బాల్ రాష్ట్ర కార్యదర్శి శోభన్ బాబు, మనోహర్ కుమార్ ఉన్నారు.
TG: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట వద్ద కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే కారులో విష్ణు అనే వ్యక్తి ఇరుక్కుపోయి మృతి చెందాడు. ఈ ఘటనలో కారులోంచి ప్రేమ్ చంద్ అనే మరో వ్యక్తి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారును బయటకు తీశారు.
VSP: అమరావతి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ బుధవారం పాల్గొన్నారు. భవిష్యత్తు లక్ష్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కే.పవణ్ కళ్యాణ్ కలెక్టర్లకు దిశ నిర్దేశం చేశారు. విశాఖపట్నంకు మరిన్ని కంపెనీలు వస్తాయన్నారు. ఈ కలెక్టర్ల సదస్సు ఎంతో కీలకమని అభివర్ణించారు.
KRNL: అమరావతిలోని సచివాలయం బ్లాక్- 2లో బుధవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో జరిగిన రెండో కలెక్టర్ల సమావేశానికి కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన సూచనలు ఆయన నమోదు చేసుకున్నారు. ఈయనతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల కలెక్టర్లు కూడా సదస్సుకు హాజరయ్యారు.
BDK: భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న భాదితులకు CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి తిరిగి వారికి అందించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న 220 మంది భాధితులకు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫోన్లను అప్పగించామని పేర్కొన్నారు.