బడ్జెట్ సమావేశాలు రేపు (మంగళవారం) ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. వచ్చే ఏడాది లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. మోడీ ప్రభుత్వానికి ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు.. దీంతో బడ్జెట్, సభకు సహాకరించాలని విపక్షాలను కేంద్రం కోరనుంది. అందుకోసం ఈ రోజు (సోమవారం) అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. సభ సజావుగా జరిగేందుకు సహాకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుంద...
పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం జగన్ చేదోడు మూడో విడత ఆర్థిక సాయాన్ని సోమవారం విడుదల చేయనున్నారు. 3,30,145 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.330.15 కోట్లను బటన్ నొక్కి జమ చేయనున్నారు. సీఎం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం జగనన్న చేదోడు. ఇందులో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయంగా ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అత్యంత పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హు...
రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది. సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్వహణ ,తెలంగాణలో ప్రగతి గురించి వివరించనున్నారు. అమెరికా హెండర్సన్‌లో జరగనున్న పర్యావరణ-జలవనరుల సమావేశానికి రావాల్సిందిగా ఇన్విటేషన్ వచ్చింది. మే 21 నుంచి 25 మధ్య జరిగే మీటింగ్స్‌లో ప్రసంగించాలని అమెరికా సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ సంస్ధ కోరింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు సహా మిషన్ భగీరథ, మిషన్ కాకత...
సీఎం జగన్‌పై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అన్నీ వర్గాలను ఇబ్బందికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. చివరికి ఉద్యోగులను కూడా వదలడం లేదన్నారు. అన్ని డిపార్ట్‌మెంట్‌లలో ఇదే పరిస్థితి అని వివరించారు. పోలీసులు గవర్నమెంట్ వద్ద జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ పేరుతో కొంత సొమ్ము జమ చేస్తారు. దానిని పిల్లల చదువు.. లేదంటే పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకునే అవసరాలకు వాడుకుం...
మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో జనాలకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఆ సంస్థలకు ప్రముఖులు ప్రచారం చేయడంతో ప్రజలు నమ్ముతుంటారు. క్యూనెట్ సంస్థ మోసాలు అన్నీ ఇన్నీ కావు. చైన్ మార్కెటింగ్‌తో దేశంలో రూ.5 వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడింది. దీనికి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వీటిని సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం సరికాదని ఆర్టీసీ ఎంజీ సజ్జనార్ అన్నారు. వాటిని సపోర్ట్ చేయొద్దని ఆ...
తెలంగాణలోని ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అభ్యర్థులు చేసిన న్యాయ పోరాటం ఫలించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు కలిపేందుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో వివాదం తలెత్తింది. ప్రశ్నలకు సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్‌లో ఒకటికంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. అయితే, వాటిలో తాము నిర్ధరించుకున్న వాటిని మాత్రమ...
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నాలుగో రోజు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో జరగనుంది. ఉదయం 8 గంటలకు యాత్ర ప్రారంభమై.. రాత్రి 7.20 గంటలకు ముగియనుంది. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను లోకేశ్ కలిసి, సమస్యలను తెలుసుకుంటున్నారు. యాత్రకు మహిళలు బ్రహ్మారథం పడుతున్నారు. స్వాగతం పలికి, వీర తిలకం దిద్దుతున్నారు. తమ సమస్యలు లోకేశ్‌తో చెప్పుకుంటున్నారు. చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుంచి నాలుగో రోజు (సోమవారం) ...
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను నటుడు మంచు మనోజ్ పరామర్శించారు. ఆదివారం రాత్రి బెంగళూరుకు చేరుకున్నాడు. ఆస్పత్రిలోకి వెళ్లి వచ్చిన అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడాడు. తారకరత్నను చూశానని.. కోలుకుంటున్నాడని తెలిపారు. తారక్ ఫైటర్ అని.. చాలా యాక్టివ్ గల వ్యక్తి అని త్వరలో క్షేమంగా బయటకు వస్తాడని తెలిపాడు. ‘తారకరత్నను చూశా. కోలుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి...
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. యువగళం పాదయాత్రలో జగన్ సర్కార్ చర్యలను ఎండగట్టారు. జగన్‌ను నమ్మి అధికారం అప్పగిస్తే.. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. మద్యపాన నిషేధం హామీతో అధికారం చేపట్టి, మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి చేపట్టిన తర్వాత అధిక ధరలపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కుప్...
ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్ తుదిశ్వాస విడిచారు. ఎఎస్ఐ గోపాల్ దాస్ కాల్పులు జరపడంతో తీవ్ర రక్తస్రావమైంది. తొలుత బ్రజ్ రాజ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి భువనేశ్వర్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. దగ్గర నుంచి ఛాతీపై గోపాల్ దాస్ కాల్పులు జరిపాడు. మరో ముగ్గురు కూడా గాయపడ్డారట. మంత్రి నబా దాస్ జార్పుగూడ జిల్లా బ్రజ్ రాజ్ నగర్‌కు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. గాంధీ సెంటర్ వద్ద కారు ...
ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్‌పై కాల్పులు జరిపిన ఎఎస్ఐ గోపాల్ దాస్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారట. అతని భార్య ఓ ప్రముఖ వార్తా సంస్థకు తెలిపింది. గత కొన్నేళ్లుగా చికిత్స తీసుకుంటున్నారని, మందులు కూడా వాడుతున్నారని పేర్కొంది. ‘ఏం జరిగిందో నాకు తెలియదు. వార్తల్లో చూసి తెలుసుకున్నా. ఘటనా జరిగిన సమయంలో నేను ఇంట్లో ఉన్నాను. ఈ రోజు ఉదయం నుంచి తాను భర్తతో మాట్లాడలేదని తెలిపింది. ఉదయం తన కూతురు వీడియో కా...
నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో స్పష్టత లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. ఏ విషయంలో క్లారిటీ లేకుండా పాదయాత్ర చేస్తున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గడపగడపకు కార్యక్రమంలో మంత్రి రజని పాల్గొన్నారు. పాదయాత్ర ఎందుకో.. ఆ యాత్ర లక్ష్యం ఏమిటో ఆయనకే తెలియనట్టు...
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోయే రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందు బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లక్నోలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా నుంచి తుది జట్టులో చోటు దక్కించుకున్న వారిలో హార్థిక్ పాండ్యా(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్ మన్ గిల్, రాహుల్ త్రిపాఠీ, సూర్యకుమార్ యాదవ్(వైస్ కెప్టెన్), దీపక్ ...
తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. కొత్త సచివాలయ ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పొగమంచులో సచివాలయ వీడియో ఒకటి ట్రోల్ అవుతుంది. మంచులో సచివాలయం తాజ్ మహల్‌ను తలపిస్తోంది. దీంతో పలువురు లైక్, చేసి కామెంట్స్ చేస్తున్నారు. వావ్.. సచివాలయం, తాజ్ మహల్‌ను పోలి ఉందని రాస్తున్నారు. ఆ వీడియో చూస్తే మీరు కూడా.. ఇదీ సచివాలయమేనా.. లేదంటే ఆగ్రాలో ఉన్న తాజ్ మహాల్ అనే స...
అమ్మాయేమో విదేశాల్లో.. అబ్బాయేమో భారతదేశంలోని మారుమూల పల్లెటూరు. అయినా వారిద్దరినీ కలిపింది ఫేస్ బుక్. వారిద్దరికి ఫేస్ బుక్ ద్వారా పరిచయం కాగా.. అది కాస్త కొన్నాళ్లకు ప్రేమగా చిగురించింది. అలా పదకొండేళ్లు ప్రేమించుకున్నారు. కలుసుకునే అవకాశం లేక ఫోన్లు, వాట్సాప్ ద్వారా ప్రేమించుకుంటూ వచ్చారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతుండడంతో వెంటనే అమ్మాయి స్వీడన్ దేశం నుంచి భారత్ కు వచ్చేసింది. వచ్చి రాగానే...