హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇకపై రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 10 నుంచి ఈ సేవలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మెట్రో సేవలు రాత్రి 10.15 గంటల వరకు కొనసాగుతుండగా..వీటిని 11 గంటల వరకు పొడిగించారు.
ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్తగా హైదరాబాద్ మెట్రోలో జర్నే చేసేందుకు వాట్సాప్ ద్వారా టిక్కెట్ బుకింగ్ చేసుకునే సేవలను కూడా ఇటీవలే ప్రారంభించారు.