మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు. మోదీ మన్ కీ బాత్ చెబుతారని..కానీ ఆయన మాత్రం వినరని ఎద్దేవా చేశారు. గుజరాత్ మోడల్ చూపించి 8 ఏళ్లలో దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇండియా నైజీరియా కంటే దారుణంగా తయారువుతుందని ఆరోపించారు.
2022 నాటికి అందరికీ ఇళ్లు ఇస్తామన్న మోదీ హామీ ఏమైందని నిలదీశారు. సాగు దండగ కాదని..పండుగ అని సీఎం కేసీఆర్ నిరూపించారని కేటీఆర్ కొనియాడారు. ఫ్లోరైడ్ సమస్య, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి హామీలు నెరవేర్చినట్లు తెలిపారు. 2024 పార్లమెంట్ ఎన్నికలే తమ లక్ష్యమని కేటీఆర్ వెల్లడించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన సమావేశంలో భాగంగా తెలిపారు.