»Ramulamma Is The Chief Coordinator Of The Telangana Congress Campaign Committee
Telangana కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా రాములమ్మ
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా టీ- కాంగ్రెస్ దూసుకుపోతుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని రోజుల సమయం మాత్రం ఉండటంతో ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు, మేనిఫెస్టోతో ప్రచారం హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో టీ- కాంగ్రెస్ ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలను నియమించింది. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్‌గా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన లేడీ ఫైర్ బ్రాండ్ విజయశాంతిని నియమించారు.
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచార ప్లానింగ్ కమిటీని నియమించింది. కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్‌గా విజయశాంతికి బాధ్యతలు అప్పగించింది. నిన్న మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) తిరిగి కాంగ్రెస్ గూటిలో చేరారు. హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. మరోవైపు మహేశ్వరం టికెట్ ఆశించిన పారిజాతకు కూడా కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. మొత్తం 15 మంది కన్వీనర్లను ప్రకటించారు. ఈ జాబితాలో సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లురవి, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్ అలీబిన్ ఇబ్రహీం మస్కతి, దీపక్ జాన్, ఓబెద్దుల కోత్వాల్, రామ్మూర్తి నాయక్‌తోపాటు పలువురు ఉన్నారు.
కాగా శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయశాంతి మీడియాతో మాట్లాడనున్నారని సమాచారం. కీలక ప్రెస్మీట్లో ఆమె ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలావుండగా పార్టీలో చేరిన సందర్భంగా విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) కి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కే పరిమితం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌లో చేరినట్లు ఆమె పేర్కొన్నారు. బీజేపీ(BJP)లో సరైన ప్రియారిటీ దక్కడం లేదని కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతికి.. హస్తం పార్టీలో చేరిన మరుసటి రోజే కీలకమైన ప్రచార కమిటీ కోఆర్డినేటర్, కన్వీనర్ పదవి ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. సినీ నటీ అయిన విజయశాంతికి రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతితో క్యాంపెయినింగ్ చేయిస్తే కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ (Congress party) భావిస్తోంది.