• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సీఎం అభ్యర్థి ఎవరో లోకేష్ చెప్పగలరా? మంత్రి విడదల రజిని సూటి ప్రశ్న

ఏపీ సీఎం అభ్యర్థి ఎవరో లోకేష్ చెప్పగలరా? అని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సూటిగా ప్రశ్నించారు. నారా లోకేశ్ యువగళం పేరుతో ప్రారంభించిన పాదయాత్రపై ఆమె విమర్శలు గుప్పించారు. అసలు లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదన్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలు ఆనందంగా ఉన్నారని.. కేవలం అధికారం కోసమే యాత్రలు చేస్తున్నారని, చంద్రబాబును సీఎం చేయాలని పవన్ కళ్యాణ్ ఆరాటపడుతున్నారని ఆమె స్పష్టం చేశారు.

January 28, 2023 / 07:34 PM IST

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి వారు దర్శనం ఇస్తున్నారు. ఇవాళ రథ సప్తమి సందర్భంగా ఉదయం నుంచే మలయప్పస్వామి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సప్త వాహనాలపై తిరుమాఢ వీధుల్లో ఆయన ఊరేగుతున్నారు. కాగా, సాయంత్రం మలయప్పస్వామిని కల్పవృక్ష వాహనంపై విహరించారు. సూర్య ప్రభ, చిన్న శేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామి వారు భక్...

January 28, 2023 / 07:17 PM IST

నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉందని ఆసుపత్రి వైద్యులు ఇంతకుముందే హెల్త్ బులిటెన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ సీనియర్ నేతలు బెంగళూరుకు వస్తున్నారు. చంద్రబాబు కూడా ఇంతకుముందే ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్నను ఆయన పరామర్శించనున్నారు. ప్రస్తుతం తారకరత్న ఐసీయూలో ఉన్...

January 28, 2023 / 07:06 PM IST

మరో పేరు మార్చిన కేంద్రం.. ఈసారి రాష్ట్రపతి భవన్ లో

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రాంతాలు, వివిధ స్మారక నిర్మాణాలు తదితర వాటి పేర్లు మారడం మొదలుపెట్టింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పట్టణాల పేర్లు మారుస్తున్నారు. ఢిల్లీలోని రాజ్ పథ్ మార్గం పేరును కర్తవ్య పథ్ గా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని మరో ముఖ్యమైన ప్రాంతానికి పేరు మార్చింది. స్వాతంత్ర్యం పూర్తి చేసుకుని 75 ఏళ్లు పూర్తయిన ...

January 28, 2023 / 06:35 PM IST

జీవో నెంబర్ 1 పై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు

ఏపీలో ప్రస్తుతం జీవో నెంబర్ 1 గురించి సర్వత్రా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల టీడీపీ సభలో జరిగిన పలు ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఏపీలోని రోడ్ల మీద ర్యాలీలు, సభలు నిర్వహించకుండా ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 ను తీసుకొచ్చింది. అయితే.. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. జీవో పేరుతో ప్రతిపక్ష పార్టీలను ఎలాంటి సమావేశాలు నిర్వహించుకోకుండా ప్రభుత్వం కక్షపూరితమైన చర్యలను పాల్పడుతోం...

January 28, 2023 / 05:44 PM IST

నారాయణ హృదయాలయకు చేరుకున్న చినరాజప్ప, దేవినేని ఉమ

నందమూరి తారకతర్న ఆరోగ్యం ప్రస్తుతం క్రిటికల్ గానే ఉందని నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇంకా చికిత్స అందించాలని వైద్యులు తెలిపారు. మరోవైపు బెంగళూరుకు నందమూరి కుటుంబ సభ్యులు బయలుదేరారు. సాయంత్రం వరకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బెంగళూరుకు రానున్నారు. టీడీపీ ముఖ్య నేతలు కూడా బెంగళూరుకు చేరుకుంటున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేతలు చినరాజప్ప, దేవినేని ఉమ నారాయణ...

January 28, 2023 / 05:23 PM IST

నారా లోకేశ్ యువగళం.. రెండో రోజు పాదయాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న యువత

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో రోజు కూడా భారీ జనసందోహం మధ్య కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకే రెండో రోజు పాదయాత్ర ప్రారంభం అయింది. పేస్ వైద్య కళాశాల నుంచి ప్రారంభం అయింది. అక్కడి నుంచి బెగ్గిలిపల్లె దగ్గర లోకేశ్ ప్రసంగించారు. ఆ తర్వాత కడపల్లెలో ఇంటరాక్షన్, అక్కడి నుంచి కలమలదొడ్డిలో ఇంటరాక్షన్ అయిపోయాక.. అక్కడి నుంచి శాంతిపురం క్యాంపు వద్ద రెండో రోజు పాదయాత్ర ముగిసింది. అద్భుత ప్రజాస్పందన, అపూర్వ జ...

January 28, 2023 / 05:07 PM IST

తెలంగాణ బస్సుల్లో రేడియో.. ఇక వింటూ ఎంచక్కా జర్నీ

రవాణా సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రెండు రోజుల్లో రెండు కీలకమైన కార్యక్రమాలను సజ్జనార్ ప్రారంభించారు. ఏఎమ్ 2 పీఎమ్ అనే సరికొత్త కొరియర్ సేవలను శుక్రవారం ప్రారంభించగా.. శనివారం ఆర్టీసీ బస్సుల్లో రేడియో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇలా రెండు రోజుల్లో రెండు కీలకమైన కార్యక్రమాలు ప్రారంభించి ప్రయాణికులకు ఆర్ట...

January 28, 2023 / 04:32 PM IST

కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ

కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలో సీబీఐ టీమ్ ప్రశ్నలు సంధిస్తోంది. అవినాష్ రెడ్డి స్టేట్ మెంట్ ను అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. అయితే.. న్యాయవాదిని మాత్రం సీబీఐ అధికారులు అనుమతించలేదు. సీబీఐ ఆఫీసుకు అవినాష్ అనుచరులు భారీగా తరలివచ్చారు. సీబీఐ ఆఫీసుకు వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు చేరుకున్నారు. వైఎస్ వివేకానంద హత...

January 28, 2023 / 04:25 PM IST

హిమాయత్ నగర్ లో భారీగా కుంగిన రోడ్డు

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో రోడ్డు భారీగా కుంగిపోయింది. 10 అడుగుల మేర రోడ్డు కుంగింది. ఒక్కసారిగా రోడ్డు మీద గుంత పడటంతో అటువైపు వెళ్తున్న వాహనదారులు అందులో చిక్కుకున్నారు. రోడ్డు కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఆ గుంతలో ఒక ట్రక్కు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయలయ్యాయి. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5 లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. మి...

January 28, 2023 / 04:26 PM IST

ముందస్తు ఎన్నికలపై బీజేపీకి కేటీఆర్ సవాల్

ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందస్తు ఎన్నికలపై బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీ నేతలకు దమ్ముంటే పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడు తాము కూడా ముందస్తు ఎన్నికలకు వస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎవరేంటో ప్రజలే తేలుస్తారన్నారు. ఇది బీజేపీకి చివరి బడ్జెట్. పెట్టేది ఏదో పెద్దలకు అనుకూలంగా కాదు.. ప...

January 28, 2023 / 05:34 PM IST

వందేభారత్ రైలు లోపల మొత్తం చెత్తే.. ప్రయాణికుల నిర్వాకంపై నెటిజన్ల మండిపాటు

మన దేశానికి ఇతర దేశాలకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? పరిశుభ్రత. మన ఇంట్లో మనం బాగానే పరిశుభ్రంగా ఉంటాం. కానీ.. ఎప్పుడైతే బయటికి వెళ్తామో అప్పుడే దాన్ని మరిచిపోతాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుంటాం. రోడ్ల మీదికి చెత్త విసిరేస్తుంటాం. ఎక్కడ చెత్త వేసినా అడిగేవాళ్లు ఉండరు కాబట్టి మనదే ఇష్టా రాజ్యం. కానీ.. కొన్ని దేశాల్లో రోడ్ల మీద చెత్త వేస్తే కఠిన శిక్షలను అమలు చేస్తారు. అందుకే అక్కడి పౌరులు [&h...

January 28, 2023 / 03:32 PM IST

క్రిటికల్ గానే తారకరత్న ఆరోగ్యం.. కొనసాగుతున్న చికిత్స

నందమూరి తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యుల బృందంతో చికిత్స చేయిస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మరికొన్ని రోజులు చికిత్స అందించాలని వైద్యులు తెలిపినట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ నిన్నటి నుంచి తారకరత్నతోనే ఉన్నారు. ఇవాళ కూడా ఇంకా బెంగళూరులోనే ఉన్నారు. న...

January 28, 2023 / 03:15 PM IST

హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన శ్రీనివాస మూర్తి శుక్రవారం మరణించడంతో సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో మరణించారు. యూకేలో ఉన్న కుమారుడు వచ్చాక ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. హీరోలు సూర్య, తల అజిత్, విక్రమ్, మోహన్ లాల్, విక్రమ్, రాజశేఖర్ వంటి అనేక మంది ప్రముఖ దక్షిణ భారత నటులకు ఆయన తన గాత్రాన్ని అ...

January 28, 2023 / 02:19 PM IST

భాగ్యనగరాన్ని వణికిస్తున్న కొత్తరకం జ్వరం.. వారికి ఎక్కువ రిస్క్

కరోనా మహమ్మారి ఇంకా పూర్తి తొలగిపోనేలేదు. అంతలోనే సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి.హైదరాబాద్ లో కొత్త రకం జ్వరం విజృంభిస్తోందని, జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు ప్రజలను హెచ్చరించారు. క్యూ ఫీవర్ గా పిలిచే ఈ వ్యాధి ఇప్పటికే పలువురిలో బయటపడిందని చెప్పారు. జంతువుల ద్వారా ఈ వ్యాధి సోకుతుందని, కబేళాలకు దూరంగా ఉండాలని సూచించారు. నగరానికి చెందిన 250 మంది మాంసం విక్రేతలకు వైద్య పరీక్షలు నిర్వహించగా....

January 28, 2023 / 01:55 PM IST