మెగా పవర్ స్టార్ హీరో రామ్చరణ్ నటించిన ధృవ మూవీ సీక్వెల్ తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ మూవీ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెబతున్నాయి.
ఇక 2016లో విడుదలైన ధృవ మూవీ ఘన విజయం సాధించి…అప్పట్లోనే 85 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తొలిసారిగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.