రోజురోజుకు యువతులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతి తన ప్రేమను ఒప్పుకోలేదని..ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది.
కూరాడకు చెందిన యువతిని స్థానికంగా ఉండే సూర్యానారయణ లవ్ చేస్తున్నానని వెంటపడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో…కోపం పెంచుకున్న యువకుడు మార్గమధ్యలో ఆమె గొంతుపై కత్తితో దాడి చేశాడు. గమనించిన స్థానికులు అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.