అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రొ కబడ్డీ, ఫుట్ బాల్ 9వ సీజన్లు నేటి నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు, పూణే,హైదరాబాద్ 3 వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది.
మరోవైపు 11 జట్లతో పోటీ పడుతున్నఇండియన్ సూపర్ లీగ్…మొదటి మ్యాచ్ కొచ్చిలో ప్రారంభం కానుంది. PKL, ISL రెండు మ్యాచులు రాత్రి ఏడున్నర నుంచి ప్రారంభం కానున్నాయి. అభిమానులు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌లలో ఈ పోటీలను లైవ్ లో వీక్షించవచ్చు.