ఓలా, ఉబర్, ర్యాపిడో కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. రాబోయే 3 రోజుల్లో ఆటో సర్వీసులను నిలిపివేయాలని ఆదేశించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొలి 2 కిలోమీటర్లకు 30 రూపాయలు వసూలు చేయాలి. ఆపై ప్రతి 2 కిలోమీటర్‌కు 15 రూపాయల చొప్పున తీసుకోవాలి. కానీ ఈ యాప్‌ల్లో తొలి 2 కిలోమీటర్లకే 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఆటో రిక్షాలను నడుపుతున్నారంటూ ఆయా కంపెనీలకు నోటీసులు పంపింది.