»Karnataka Govt Actions Against Women Ips Ias Officers Action To Transferred
Social Media War: ఐపీఎస్, ఐఏఎస్ మహిళా అధికారులపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు
ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులు గొడవకు దిగిన అంశంపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇద్దరు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. కానీ ప్రస్తుతం వీరికి ఏ శాఖలో కూడా పోస్టును కేటాయించలేదు.
ఆదివారం సోషల్ మీడియా(social media)లో వ్యక్తిగత ఫొటోల గురించి ఇద్దరు ఐపీఎస్(IPS), ఐఏఎస్(IAS) మహిళా అధికారులు కామెంట్ల గొడవకు దిగిన అంశంపై కర్ణాటక ప్రభుత్వం(karnataka government) చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో వీరిద్దరు అధికారులను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారిని రోహిణి సింధూరి(Rohini sindhuri)ని కర్ణాటక ఎండోమెంట్ శాఖ కమిషనర్గా విధుల నుంచి తొలగించి..ఆమె స్థానంలో మరో ఐఏఎస్ అధికారి బసవ రాజేంద్రను ప్రభుత్వం నియమించింది. మరోవైపు ఐపీఎస్ అధికారిణి డీ రూప(roopa d moudgil) కర్ణాటక హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తుండగా..ఈమె స్థానంలో డీ భారతిని నియమించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఈ క్రమంలో బదిలీ(transferred)చేసిన ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులకు ఎలాంటి పోస్టులు కేటాయించలేదు.
Karnataka | IPS officer D Roopa Moudgil and IAS officer Rohini Sindhuri transferred without posting after fight on social media over sharing private photos. pic.twitter.com/YdP5QL4OUg
అసలు విషయానికి వస్తే IAS ఆఫీసర్ రోహిణి సింధూరి (Rohini sindhuri) పర్సనల్ ఫొటోలను.. IPS అధికారిణి డీ రూప మౌద్గిల్(roopa d moudgil) సోషల్ మీడియాలో ఆదివారం పోస్ట్ చేశారు. మరోవైపు ఇదే ఫొటోలను ఇదివరకు రోహిణి పలువురు పురుష IAS అధికారులకు కూడా షేర్ చేశారని రూప పేర్కొన్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో కామెంట్ల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు కామెంట్లు(comments) చేసుకున్నారు. దీంతోపాటు అవినీతి ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ఈ అంశంపై సీఎం ప్రధాన కార్యదర్శి శర్మకు కూడా కంప్లైంట్ చేసినట్లు రూప(roopa) తెలిపారు.
మరోవైపు స్పందించిన రోహిణి(Rohini) తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరువుకు భంగం కలిగించే విధంగా తన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..తర్వాత నేనే వేరే వాళ్లకి పంపానని ఆరోపిస్తున్నారని రోహిణీ పేర్కొన్నారు. అసలు నేను ఫోటోలు పంపిన వ్యక్తులు ఎవరో కూడా చెప్పాలని ప్రశ్నించారు. ఇలా వీరిద్దరు ఫేస్ బుక్ వేదికగా కామెంట్లు చేసుకోవడంతో వీరి గొడవ కాస్తా కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఐఏఎస్ రోహిణి సింధూరి ప్రస్తుతం కర్ణాటక మతం, స్వచ్ఛంద సంస్థ శాఖ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఐపీఎస్ అధికారిణి డీ రూప(roopa).. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న కర్ణాటక(Karnataka) హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర(home minister araga jnanendra) తప్పు చేసిన ఇద్దరు మహిళా అధికారులపై చర్యలు తీసుకున్నారు.