సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ఎన్.శ్రీధర్ పదవి కాలం ముగియడంతో ఆయన బదిలీ అయ్యారు. సింగరేణి ఫైనాన్స్ డైరక్టర్‌గా ఉన్న ఎన్.బల్ రాంకుని ఆయన స్థానంలో సీఅండ్ఎండీగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసంది.
Singareni: సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ఎన్.శ్రీధర్ బదిలీ అయ్యారు. పదవి కాలం ముగియడంతో ఆయనను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సింగరేణి ఫైనాన్స్ డైరక్టర్‌గా ఉన్న ఎన్.బల్ రాంకుని ఆయన స్థానంలో సీఅండ్ఎండీగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సీఎండీగా శ్రీధర్ 2015 జనవరి 1న బాధ్యతలు చేపట్టారు. సంస్థ చరిత్రలో 9ఏళ్ల పాటు సుదీర్ఘంగా పదవిలో కొనసాగిన వ్యక్తిగా రికార్డుల్లో నిలిచారు. అయితే ఒక వ్యక్తిని ఎక్కువ కాలంపాటు ఎండీగా కొనసాగించకూడదు. కానీ శ్రీధర్ కేసీఆర్ సర్కార్‌లో ఒకసారి రెండేళ్లు, రెండుసార్లు ఏడాది ఎక్స్టెన్షన్ ఇచ్చింది. మళ్లీ 2021లో సింగరేణి సీఎండీగా శ్రీధర్‌ను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కానీ శ్రీధర్ ఎండీగా కొనసాగారు. ఈక్రమంలో కాంగ్రెస్ మార్పులు చేసింది.