తెలంగాణ ప్రభుత్వం 26 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగించింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న శాఖల నుంచి వేరే శాఖలకు ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీలు అయ్యారు. ప్రభుత్వం 26 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగించింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న శాఖల నుంచి వేరే శాఖలకు ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మైన్స్ అండ్ జియోలజి ప్రిన్సిపల్‌గా మహేశ్ దత్ ఎక్కాను నియమించారు. ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా అహ్మద్ నదీమ్, సాగునీటి శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను బదిలీ చేశారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరక్టర్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ బాధ్యతలను డీ దివ్వకు అప్పగించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శశాంక నియామకం
నల్గొండ కలెక్టర్‌గా దాసరి హరిచందన
మహబూబాబాద్ కలెక్టర్‌గా అద్వైత్ కుమార్
సంగారెడ్డి కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి
గద్వాల కలెక్టర్‌గా బీఎం సంతోష్
సీఎం ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు
పురావస్తు శాఖ డైరక్టర్‌గా భారతీ హోళికేరి