»Rss Leaders Invited Pawan Kalyan For Rama Mandir Inauguration Ceremony At Ayodhya
Pawan Kalyan : అయోధ్య రామమందిరం.. ప్రారంభోత్సవానికి రావాలంటూ పవన్ కు ఆహ్వానం
ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని హిందువుల కలను నెరవేర్చింది. ఈ ప్రారంభోత్సవానికి ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు హాజరవుతారు.
Pawan Kalyan : ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని హిందువుల కలను నెరవేర్చింది. ఈ ప్రారంభోత్సవానికి ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు హాజరవుతారు. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం యోగి జాగ్రత్తలు తీసుకున్నారు. అంతే కాకుండా ఈ ప్రారంభోత్సవ వేడుకకు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆర్.ఎస్.ఎస్. సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్ ఆహ్వాన పత్రాన్ని అందించారు.
ఆయనతో పాటు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ఆర్.ఎస్.ఎస్. కార్యాలయ ప్రముఖ్ పూర్ణ ప్రజ్ఞ కూడా ఈ భేటీ లో పాల్గొన్నారు. అయోధ్య రామమందిరానికి సంబంధించిన వివరాలను పవన్ కళ్యాణ్ తో పంచుకుని కాసేపు ముచ్చటించారు. పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి, ప్రభాస్ లకు కూడా ఆహ్వానం అందింది. అయితే కొన్ని కారణాల వల్ల చిరంజీవి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ అయినా వస్తాడో లేదో చూడాలి. ప్రతిష్టాత్మక ఆలయ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆహ్వానం అందుకోవడం ఆయన ఫ్యాన్స్ చాలా గౌరవంగా భావిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ప్రారంభోత్సవ వేడుకకు హాజరవుతాడా లేదా అనేది చూడాలి.