Japan Earthquake: ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి ఆహ్వానిస్తుంటే జపాన్ని మాత్రం భూకంపం అతలాకుతలం చేసింది. వరుస బలమైన భూకంపాలతో జపాన్ ప్రజలను వణికించింది. 18 గంటల్లో 155 సార్లు భూమి కంపించింది. కేవలం రెండు గంటల్లోనే 40 పక్రంపనాలు వచ్చాయి. రిక్టర్ స్టేలుపై 7.6 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందని అక్కడ వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంతాలల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. తీరప్రాంత ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఇప్పటి వరకు దాదాపు 13 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.
Some of the Footage coming out of Japan following the 7.6 Magnitude Earthquake which Struck the Country earlier this morning is Insane and truly shows the Power of Geological Forces on this Planet. pic.twitter.com/iwCRB3jmCv
భవనాలు కూలడం, అగ్నిప్రమాదాల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. 45 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూకంపం వల్ల ప్రధాన రహదారులన్నీ బీటలు వారి.. వాహనాలు కదలడం అసాధ్యంగా మారింది. నగరానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ బీటలు వారాయి. పోర్టును సునామీ అలలు తాకడంతో చాలా పడవలు బోల్తాపడ్డాయి. చాలా ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. సహాయక చర్యలు చేపట్టడానికి కూడా సమయం లేదు. వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. అసలు ఎంత ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిందో పూర్తిగా తెలియదు.