»Panjagutta Police Station Total Staff Transferred By Cp Srinivas Reddy
Panjagutta Police Station: సిబ్బంది మొత్తం బదిలీ.. ఇదే మొదటి సారి
పంజాగుట్ట స్టేషన్లో హోగార్డ్ నుంచి ఎస్ఐల వరకు అందరూ ఒకేసారి బదిలీ చేస్తూ సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ పెద్దలకు సమాచారం లీక్ అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Panjagutta Police Station: పంజాగుట్ట(Panjagutta) పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్నీ, ఎస్ఐల నుంచి హోంగార్డుల వరకు బదిలీ చేస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి(srinivas-reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్టేషన్లో మొత్తం 85 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వారంత సిటీ ఆర్మ్ డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని వెల్లడించారు. వీరి స్థానంలో ప్రస్తుతం 82 మందిని నియమస్తున్నట్లు ప్రకటించారు. ఇలా పీఎస్ లో సిబ్బంది మొత్తాన్ని ఒకేరోజు బదిలీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం విషయంగా మారింది.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగిన పరిణామాలా దృష్ట్యా సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో పాటు మాజీ ఎమ్మెల్యే కొడుకు ప్రగతిభవన్ బారుకేడ్ల యాక్సిడెంట్ విషయంలో చోటుచేసుకున్న పరిణామాలపై విమర్శలు వ్యక్తం కావడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గత ప్రభుత్వంలోని పెద్దలకు ఈ స్టేషన్ నుంచి సమాచారం లీకవుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటి నేపథ్యంలోనే కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.