»Telangana Break For Swearing In Of Governor Quota Mlcs
Telangana: కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు.. రేవంత్ రెడ్డి
ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఇటీవల గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన ఆచార్య కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌ల ప్రమాణ స్వీకారానికి వాయిదా పడింది.
Telangana: ఇటీవల గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన ఆచార్య కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌ల ప్రమాణ స్వీకారానికి వాయిదా పడింది. ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఈ నియామకంపై ఫిబ్రవరి 8వ తేదీ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను ప్రతిపాదించింది. వీరిలో శ్రవణ్‌కుమార్ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అని, సత్యనారాయణ ఓ కార్మిక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. వాళ్ల పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.
దీన్ని సవాల్ చేస్తూ శ్రవణ్‌కుమార్, సత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై ఫిబ్రవరి 8న విచారణ జరగాల్సి ఉంది. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌ల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా తమిళిసై ఆమోదం తెలిపారు. వారిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 27న జీవో నంబరు 12 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేవరకు ఎమ్మెల్సీల నియామకంపై ముందుకెళ్లకూడదని గవర్నర్ తెలిపారు. ఇలా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార వాయిదా పడటానికి కారణం కేసీఆర్ అని.. వీటి వెనుక ఉండి ఆయన కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.