Kumari Aunty's food truck was blocked by the traffic police!
Kumari Aunty: హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్‌లో మధ్యహ్నాం భోజనాలకు చాలా డిమాండ్ ఉంది. ఈ మెట్రోపాలిటన్ సిటీలో చాలా మంది ఆకలి తీర్చుతున్నవి ఆ ఫుడ్ సెంటర్లే. ఈ మధ్య కుమారి ఆంటీ అనే ఒక పేరు తెగ వైరల్ అయింది. ఇలీ సోషల్ మీడియాలో వైరల్ అయిందో లేదో ప్రస్తుతం తన బిజెనెస్ మూత పడే పరిస్థితి. ఆమె అసలు పేరు దాసరి సాయి కుమారి. ఓ ఫుడ్ ట్రక్ పెట్టుకొని జీవనం సాగిస్తుంది. మధ్యహ్నం సమయంలో తన బండి వద్ద కాస్త ఎక్కువగానే రద్దీ ఉంటుంది. అలాగే తన మాటలతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. రెండు లివర్లు ఎక్స్ట్రా రూ. 150 అంటూ, మొత్తం బిల్లు వెయ్యి అనే డైలాగ్‌తో సోషల్ మీడియా స్టార్‌గా మారింది. దాంతో యూట్యూబ్ చేసుకునే వాళ్లు విపరీతంగా ఎగబడ్డారు.
అన్ని బాగానే ఉన్నాయి అనుకున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఆమె బిజినెస్‌ను అడ్డుకున్నారు. దీనికి కారణం తన బండి దగ్గరకు వచ్చే కస్టమర్లే. తినే వాళ్ల కంటే టైమ్ పాస్ చేసే వాల్లు ఎక్కువయ్యారు. వీడియోల పేరిట నానా హంగామా మొదలు పెట్టారు. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువైంది. పోలీసులు చెప్పి చూశారు. కుమారి ఆంటీ కస్టమర్లతో వాపోయింది. అయినా తన మాట వినలేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఈ రోజు తన బండి ఓపెన్ చేయనీయలేదు. గతంలో కూడా ఇలానే జరిగిందని, తరువాత పోలీసులే అను మతించినట్లు కుమారి తెలిపారు. ఏదేమైనా బిజినెస్ చేసుకునే ఆవిడను నెట్టింట్లో వైరల్ చేసి, ఇప్పుడు తన వ్యాపారానికి ముప్పు వాటిల్లేలా చేశారు.