»Hyderabad Traffic Police Warn Those Crossing The Road In Black Clothes Video Viral
Road Accident: నలుపు రంగు దుస్తులతో రోడ్డు దాటేవారికి హెచ్చరిక.. వీడియో వైరల్
రోడ్డు ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణం మద్యపానం, నిర్లక్ష్యం, అతివేగం, నిద్రమత్తు అనుకుంటున్నాము. అయితే వీటితోపాటు మరో కారణం కూడా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే రోడ్డు దాటుతున్న వ్యక్తులు ధరించే దుస్తులు కూడా ఓ కారణం.
Hyderabad traffic police warn those crossing the road in black clothes.. Video viral
Road Accident: రోడ్డు దాటేప్పుడు వస్తున్న వెహికిల్స్ చూసుకుంటూనే దాటుతాం అయినా కానీ ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటాయి. దీని కారణం మద్యపానం, నిర్లక్ష్యం, అతివేగం, నిద్రమత్తు అనుకుంటున్నాము. అయితే వీటితోపాటు మరో కారణం కూడా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే రోడ్డు దాటుతున్న వ్యక్తులు ధరించే దుస్తులు కూడా ఓ కారణం. ముఖ్యంగా రాత్రి సమయంలో రోడ్డు దాటే వ్యక్తులు నలుపు రంగు చొక్కాలు, టీ షర్టులు ధరిస్తే దూరంగా వచ్చే వాహనదారులకు సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ఓ వీడియోను షేర్ చేశారు. అలాగే రోడ్డు దాటేసమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలిపారు.
చదవండి:Bhadradri Kothagudem : 28 కోట్ల విలువైన గంజాయి దహనం
వీడియోలో చూసినట్లైతే.. ఓ వ్యక్తి నలుపురంగు షర్టు ధరించి రోడ్డు దాటుతున్నాడు. చుట్టు చీకటి కారణంగా అతడు ధరించిన చొక్కా కూడా నలుపు రంగే కాబట్టి ఎదురుగా వస్తున్న వాహన డ్రైవర్‌కు దగ్గరకు వచ్చే వరకు కనిపించలేదు. క్షణకాలంలో అతడు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రాత్రివేళ రోడ్డు ప్రమాదాలకు దుస్తులు కూడా కారణమని పోలీసులు తెలిపారు. నైట్ సమయంలో బైక్‌పై వెళ్లేవారు, రోడ్డు దాటేవారు నలుపు రంగు దుస్తులు ధరించవద్దని కోరారు. లేతరంగు దుస్తులు, పసుపు, తెలుపు రంగు దుస్తులు ధరించాలని, లేదంటే రిఫ్లెక్టివ్ దుస్తులు ధరించాలని తెలిపారు.