Revanth Sarkar green signal for Gaddar statue on Tank Bund
Gaddar: ప్రజా గాయకుడు గద్దర్(Gaddar) విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలో రాగానే గద్దర్‌కు తగిన గౌరవం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఈ రోజు గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలతో కలిసి నిర్ణయం తీసుకున్నారు. గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది.
గద్దర్ అంత్యక్రియలు అధికార లాంచనాలతో జరిగినప్పటికీ రేవంత్ రెడ్డి దగ్గరుండి చూసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కుమార్తె వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసింది. గద్దర్ పట్ల మొదటి నుంచి సానుకూలంగానే స్పందించిన రేవంత్ రెడ్డి నేటి ప్రకటనతో మాట నిలబెట్టుకున్నారు. దీంతో గద్దర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.