»Telangana High Court Breaks The Oath Taking Of Mlcs
High Court: ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాణికి తెలంగాణ హైకోర్టు బ్రేక్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు నిలిపేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రమాణ స్వీకారం ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.
Telangana High Court breaks the oath taking of MLCs
High Court: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నిలిపేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రమాణ స్వీకారం ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 8వ తేదీ వరకు వేచి ఉండండి అని తెలిపింది. తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan) అమోదించిన విషయం తెలిసిందే.
వీరి నియామకాలను బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించగా.. వారిని నియమించడం నిబంధనలకు వ్యతిరేకం అని గవర్నర్ తిరస్కరించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ సంతకం చేశారు. దీనిపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు తమను ఎందుకు తిరస్కరించారో తెలియజేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.