Komatireddy is behaving like a street bully BRS MP Lingaiah Yadav
Komati Reddy Venkat Reddy: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Komati Reddy)పై వీధి రౌడిలా ప్రవర్తిస్తున్నాడంటూ బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్(MP Lingaiah Yadav) విమర్శించారు. ఇలాంటి దుర్మార్గమైన మంత్రిని గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో కోమటిరెడ్డి తీరుపై ఎంపీ పలు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం జెడ్పీ చైర్మెన్ సందీప్ రెడ్డిని పిలిచి అవమానించాడని ఎంపీ పేర్కొన్నారు. కోమటిరెడ్డి తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని అన్నారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్కు పాలన చేయడం చేతకాదని అందుకూ నోటికి వచ్చినట్లు దురుసుగా మాట్లాడుతున్నారని లింగయ్య యాదవ్ పేర్కొన్నారు.
జిల్లాలోని గూడురు పంచాయితీ భవనం అవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన కోమటిరెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని నోటికి వచ్చినట్లు మాట్లాడారని, ఆయన తండ్రి కేసీఆర్ ఎమ్మెల్యే అయిన తరువాత కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చాడని, ఆయన పేరు చెప్పుకొని ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన పేరు చెప్పుకొని మంత్రి అయ్యాడు అని చెబుతూ.. తనకు, సీఎం రేవంత్ రెడ్డికి బ్యాక్ సపోర్ట్ లేదని తాము సొంతంగా ఎదిగామని చెబుతూ.. ఇక్కడున్న జెడ్పీ చైర్మెన్ సందీప్ రెడ్డి సైతం ఎలిమేని మాదవరెడ్డి పేరు చెప్పుకొని గెలిచాడని అన్నారు. దాంతో సభలో ఒక్క సారిగా రసాభాస ఏర్పండి. ఎందుకు అని ప్రశ్నించిన సందీప్ రెడ్డిని పోలీసుల సాయంతో సమావేశం నుంచి బయటకు పంపించారు. దీనిపై ఎంపీ లింగయ్య యాదవ్ స్పందించారు.. వెంకట్ రెడ్డికి తాను మంత్రి అనే సోయి లేదని, గుండాయిజం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో తాము ఇలాంటి చర్యలు చేయలేదన్నారు. కోమటిరెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని వెల్లడించారు. ఇక ప్రజలకు మీరెంటో రెండు నెలల్లోనే అర్థం అయిందని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు.