మాజీ పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత పి. నర్సారెడ్డి(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
Narsa Reddy: మాజీ పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత పి. నర్సారెడ్డి(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నర్సారెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నర్సా రెడ్డి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ను విముక్తి చేసే పోరాటంలో కూడా పాల్గొన్నారు. 1940 ప్రారంభం నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీ కావడానికి ముందు అతను వరుసగా మూడు సార్లు శాసనసభ సభ్యుడిగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉన్నారు. 1971లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. నిర్మల్‌కు చెందిన నర్సారెడ్డి ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో వైట్ హౌస్‌లో నివాసం ఉంటున్నారు.