»Traffic Restrictions In Hyderabad For Ramzan Festival Where Else
Ramzan festival: ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ దారుల్లో వెళ్తే ఇక అంతే
రంజాన్ పండుగ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముస్లింల ప్రత్యేక నమాజు దృష్ట్యా పలు ప్రాంతాల్లో వాహనాల దారి మళ్లింపుతో పాటు పలుచోట్ల రోడ్ క్లోజ్ చేయనున్నారు.
Traffic restrictions in Hyderabad for Ramzan festival.. where else..!
Ramzan festival: రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముస్లింల ప్రత్యేక నమాజు దృష్ట్యా మాసాబ్ ట్యాంక్, పురానాపూల్, కామాటిపురా, కిషన్ బాగ్ ప్రాంతాల్లో రద్దిని తగ్గించేందుకు వాహనాలను దారి మళ్లింపు చర్యలు తీసుకుంటారు. ఆ దారులను కలుపే పలు కూడల్లు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆంక్షలు గురువారం ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు అమలు చేస్తామని తెలిపారు. వాహనదారులు సహకరించాలని కమిషనర్ కోరుతూ ప్రకటన విడుదల చేశారు.
కిషన్ బాగ్, పురానాపూల్, కామాటిపురా నుంచి ఈద్గా వైపు వచ్చే వాహనాలను బహదూర్‌పురా క్రాస్ రోడ్స్ వద్ద దారి మళ్లిస్తారు. పురానాపూల్ నుంచి బహదూర్‌పురా వైపునకు వెళ్లే బస్సులను జియాగూడ వైపునకు మళ్లిస్తారు. ఈద్గాలో ప్రార్థనలకు వచ్చే వారు తమ వాహనాలను జూపార్క్ ఓపెన్ ప్లేస్ లో పార్క్ చేసుకోవాలని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలాగే శివరాంపల్లి, దానమ్మహట్స్ వైపు వచ్చే వాహనాలను మోడరన్ సా మిల్, మీరాలం ఫిల్టర్ బెడ్, సూఫీ కార్స్ దగ్గర పార్కింగ్ చేసుకోవాలని వెల్లడించారు. అలాగే కాలాపత్తర్ నుంచి వచ్చే వెహికిల్స్‌ను మోచీ కాలనీ, బహదూర్‌పురా, శంషీర్‌గంజ్, నవాబ్ సాహెబ్‌కుంట వైపు దారిమళ్లిస్తారు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు వచ్చే వాహనదారుల కోసం భయ్యా పార్కింగ్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పార్కింగ్ ఏర్పాటు చేశారు.