తెలంగాణలో మళ్లీ ఎన్నికల జోరు మొదలైంది. ఈరోజు నుంచి మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 14 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా…అక్టోబర్ 17న నామినేషన్ల ఉపసంహరణ చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రిటర్నింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథ రావును నియమించారు. నామినేషన్ల ప్రక్రియ విధానాన్ని వీడియో రికార్డు చేయనున్నారు. ఈ క్రమంలో నవంబర్ 3న ఎన్నికల పోలింగ్ జరగనుండగా..నవంబర్ 6న ఫలితాలు రిలీజ్ చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నికలకు తక్కువ సమయం ఇచ్చినందున ప్రధాన పార్టీలు ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.