స్విస్ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ ఏజీ భారత్ నుండి తప్పుకుంటోంది. నోవార్టిస్ ఇండియాలో తనకున్న 70.68% వాటాను రూ.1,446 కోట్లకు క్రిస్ క్యాపిటల్‌కు విక్రయించనుంది. అదనంగా 26% వాటా కోసం షేరుకు రూ.860.64 చొప్పున రూ.552 కోట్లతో ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది చివరికల్లా ఈ భారీ డీల్ పూర్తి కానుంది. దీంతో భారత వ్యాపారానికి నోవార్టిస్ ఫుల్స్టాప్ పెట్టనుంది.