godfather movie day 1 collections worldwide screen grab twitter
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 38 కోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల గ్రాస్ వసూలైనట్లు తెలిసింది.
దసరా పండుగ సందర్భంగా నిన్న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మోహన్ రాజా దర్శకత్వం ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. మలయాళ మూవీ లూసీఫర్ రిమేక్‌గా ఈ మూవీని తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయగా….సూపర్ గుడ్ ఫిలింస్ ఆధ్వర్యంలో రామ్‌చరణ్, R.B. చౌదరి, N. V. ప్రసాద్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.