AP: రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. ‘వ్యవసాయం దండగ అనే రీతిలోనే ఇప్పటికీ చంద్రబాబు ఆలోచిస్తున్నారు. సగటున రోజుకు 8 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభమే ఈ ఆత్మహత్యలకు కారణం. చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆదుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.