SKLM: రణస్థలం మండల జేఆర్‌పురం గ్రామానికి చెందిన ప్రజాశక్తి విలేఖరి వరప్రసాద్ తండ్రి నరసింగారావు బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు ఆయన స్వగృహంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిన్నింటి బానోజీ నాయుడు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ELR: స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నూజివీడులో త్రిబుల్ ఐటీ క్యాంపస్‌లో ఈనెల 20న మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. మంత్రి పార్ధసారధి సూచన మేరకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా భారీ జాబ్ మేళాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మంత్రి బుధవారం జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు.
PPM: గ్రామపంచాయతీలో అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో రూపేష్ కుమార్ అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం రెండు రోజు శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ.. గుడ్ గవర్నెన్స్‌కు సంబంధించి తొమ్మిది అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. అలాగే గ్రామపంచాయతీలను ఆదర్శంగా తీర్చదిద్దాలన్నారు.
అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. మంత్రి కార్యాలయం ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో తాలిబన్ మంత్రి ఖలీల్ ఉల్ రెహమాన్ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు మరో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, ఉల్ రెహమాన్ శరణార్థి శాఖను నిర్వహిస్తున్నారు.
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. 14 గేమ్‌లలో 13 మ్యాచ్‌లు ముగిశాయి. నేడు జరిగిన 13వ గేమ్ డ్రాగా ముగిసింది. ఇద్దరు ఆటగాళ్లు 6.5-6.5 పాయింట్లతో సమానంగా ఉన్నారు. రేపు జరిగే చివరి మ్యాచ్‌లో గెలుపొందిన ఆటగాడు ఛాంపియన్‌గా నిలుస్తాడు.
AKP: రోలుగుంట మండలం శరభవరం గ్రామంలో రెవెన్యూ సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగమ్మ మాట్లాడుతూ.. రైతుల భూసమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సదస్సులో రైతులు తమ భూసమస్యలపై అర్జీలు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ప్రస్తుతం 65 లక్షల మంది గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు ఉన్నట్లు నీతి అయోగ్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వారికి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించేందుకు కేంద్రం ప్రత్యేక పథకాన్ని తీసుకురానుంది. వారికి పెన్షన్, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పించేందుకు ఈ పథకం రూపొందిస్తున్నట్లు కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకా...
NRPT: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు పకడ్బందీగా సేకరించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైద్రాబాద్ సెక్రటేరియట్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట అదనపు కలెక్టర్ బెన్ శాలం పాల్గొన్నారు. ఇళ్ల దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలనకు సర్వేయర్‌ను నియమించాలని మంత్రి సూచించారు.
WNP: ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్యకేంద్రాన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా పరమేశ్వరచారి, ఢీ కురుమయ్య, సాయిలీల, ఆదిలు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డాక్టర్ లేక స్కానింగ్‌కు గర్భిణీలు బయటికి వెళ్లాల్సి వస్తుందన్నారు. కనీసం నీటి సౌకర్యం కూడా లేదన్నారు. వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
SKLM: రెవెన్యూ సదస్సులతోనే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సరుబుజ్జిలి తహసీల్దార్ మధుసూదన్ రావు అన్నారు. సరుబుజ్జిలి మండలం పెద్ద సవలాపురం గ్రామంలో బుధవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సదస్సుల ద్వారా దీర్ఘకాలికంగా ఉన్న రైతుల భూ సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు.
KMM: ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలలో వివిధ ఆటలలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు మధిర మండల తహశీల్దార్ రాంబాబు ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మధిర మండలంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొమ్మలపాడు రైతు సేవ కేంద్రం నందు మల్బరీ సాగు విధానంపై నూతన రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి డిస్టిక్ సెరికల్చర్ ఆఫీసర్ సుజయ్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మల్బరీ సాగుతో ఎకరానికి ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పారు. మల్బరీ సాగుపై మక్కువ చూపాలని అన్నారు.
CTR: చామంతిపురం వద్ద సుబ్రహ్మణ్యం, ఆటొ చిట్టి, రాజేష్ అనే ముగ్గురిని అరెస్టు చేసి రూ.62,340 విలువ చేసే 2.078 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వన్టౌన్ సీఐ జయరామయ్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
TG: మంచు ఫ్యామిలీ హైడ్రామాలో పోలీసులు మనోజ్‌ను విచారించారు. అనంతరం విష్ణుని విచారణకు పిలవడంతో నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయానికి వెళ్లాడు. సీపీ సుధీర్ బాబు అతన్ని విచారించనున్నారు. జిల్లా అదనపు మెజిస్ట్రేట్ హోదాలో విష్ణుని సీపీ విచారించనున్నారు.
KNR : పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, తాజా మాజీ సర్పంచ్‌లు కరీంనగర్‌లో పోరుబాట పట్టారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. దాదాపు ఏడాది నుంచి బిల్లుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు.