AP: గుంటూరు జిల్లా నల్లపాడులో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇమడాబత్తిన నాగేశ్వరరావు కిడ్నాప్‌కు గురయ్యాడు. వైసీపీ నేత దుగ్గెం నాగిరెడ్డి రూ. 2 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. నాగేశ్వరరావు డబ్బుల్లేవని చెప్పడంతో నాగిరెడ్డి పెన్నుతో గొంతుపై దాడి చేసి కర్రతో కొట్టాడు. నాగేశ్వరరావు స్థానికుల సాయంతో తప్పించుకొని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త...
ప్రకాశం: మహిళ హత్య కేసులో బుధవారం ఒంగోలు పీడీజే కోర్టు జడ్జి భారతి తీర్పు ఇచ్చారు. చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెంకు చెందిన నాగులూరి యాకోబు చీమకుర్తికి చెందిన లక్ష్మీతో సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే ఆమెపై అనుమానం పెంచుకొని మద్యం మత్తులో 2020 ఫిబ్రవరి 22న తలపై కర్రతో కొట్టగా ఆమె చనిపోయింది. దీనిపై చీమకుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
కృష్ణా: ప్రయాణికులను ఏమార్చి దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు విజయవాడ పోలీసులు వెల్లడించారు. ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సురేష్, తారకేశ్వరరావు, కంబల శ్రీను, రాజు అనే వ్యక్తులు బస్టాండ్ల వద్ద ప్రయాణికులను మోసం చేస్తూ ఉంటారన్నారు. ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టి వీరిని పట్టుకున్నామని చెప్పారు.
GNTR: నగరంలో స్థానిక బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర గుంటూరు తూర్పు వైసీపీ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే ముస్తఫా శంకుస్థాపన చేశారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా నూతన కార్యాలయ నిర్మాణం జరుగుతుందని తూర్పు వైసీపీ ఇంఛార్జ్ నూరి ఫాతిమా తెలిపారు. కార్యక్రమంలో పలు డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మరి కొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కనుంది. తన స్నేహితుడు ఆంటోనీతో రేపు వివాహం చేసుకోనుంది. కీర్తి-ఆంటోనిల పెళ్లి గోవాలో జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరువురి కుటుంబాలు గోవాకు చేరుకున్నాయి. తాజాగా జరిగిన మెహందీ వేడుక ఫొటోలను కీర్తీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
HNK: హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో ఈరోజు రుద్రేశ్వరస్వామికి అర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేశారు. నేడు మార్గశిర మాసం ఏకాదశి తిధి, బుధవారం కావడంతో ఉదయాన్నే స్వామివారికి అభిషేకం నిర్వహించి, పూలు, పూలమాలలతో ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
BHNG: టీజీపీఎస్సీ గ్రూప్ -2 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రకాశం: దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాజీ సీఎం జగన్‌ను కలిశారు. తన తల్లి వెంకాయమ్మతో కలిసి తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని తాజా రాజకీయ పరిణామాలను ఆయన అధినేతకు వివరించారు. పార్టీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వంపై పోరాట కార్యక్రమాలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జగన్ పలు సూచనలు చేశారు.
ఓ నటి పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ప్రముఖ నటుడు, దర్శకుడు బాలచంద్ర మేనన్‌కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. 2007లో ఓ సినిమా షూటింగ్‌లో బాలచంద్ర మేనన్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఓ నటి ఇటీవల ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మహిళలకే కాదు.. పురుషులకూ గౌరవ మర్యాదలు ఉంటాయని తెలిపింది.
ఎన్టీఆర్: నాటు సారాను తయారుచేసి విక్రయించిన రెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాలకు చెందిన ముగ్గురిని బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేసినట్లు మైలవరం ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని బండయ్య, రమాదేవి, మల్లది ఏసు సారా విక్రయించేవారు అన్నారు. వీరిని తహశీల్దార్ ఎదుట హాజరుపర్చి బైండోవర్ చేసినట్లు తెలిపారు.
ELR: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి సార్వత్రిక ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులను, కార్యకర్తలను నేటికి గుర్తించక పోవడం వల్లనే ఆ పార్టీ సభ్యత్వానికి పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ సంకు నాగశేషు ప్రకటించారు. అనంతరం బుధవారం నిడమర్రు మండలం భువనపల్లిలో విలేకరులతో మాట్లాడారు.
TG: రేపటి నుంచే సచివాలయంలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రారంభం కానుంది. సెక్రెటేరియట్‌లో పనిచేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. ఔట్ సోర్సింగ్, సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి వర్తిస్తుందని వెల్లడించారు.
కృష్ణా: గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి బుధవారం తరలించారు. ముసునూరు చెరువు వద్ద గుర్తు తెలియని వృద్ధుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వృద్ధుడి ఎవరు? మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు.
NDL: బనగానపల్లె మండలంలోని చిన్నరాజుపాలెం గ్రామంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నాయకులు కార్యకర్తలు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు.
WNP: ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాజీఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి కనపడటం లేదా అని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ పల్లెపోగు ప్రశాంత్ ప్రశ్నించారు. కొత్తకోట పార్టీఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిపాలనలో సాధించిన ప్రగతి అని అన్నారు.