AP: గుంటూరు జిల్లా నల్లపాడులో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇమడాబత్తిన నాగేశ్వరరావు కిడ్నాప్‌కు గురయ్యాడు. వైసీపీ నేత దుగ్గెం నాగిరెడ్డి రూ. 2 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. నాగేశ్వరరావు డబ్బుల్లేవని చెప్పడంతో నాగిరెడ్డి పెన్నుతో గొంతుపై దాడి చేసి కర్రతో కొట్టాడు. నాగేశ్వరరావు స్థానికుల సాయంతో తప్పించుకొని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.