ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ప్రతి సమస్య ఆన్ లైన్ చేసి నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు.
KMM: వేంసూరు మండలంలో మర్లపాడు గ్రామంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు ఆదివారం తెలిపారు. రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు కొమ్ములు కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైసెన్సు లేని ఇసుక ట్రాక్టర్లు విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రజలు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని అన్నారు.
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం కృష్ణతేజ అతిథి భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 82,043 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 32,299 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లుగా నమోదైంది.
ప్రకాశం: సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కందుకూరు ఫ్లైఓవర్ మీద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు వెళ్తున్న కంటైనర్ బాక్స్ లారీని పుచ్చకాయ లోడ్‌తో వెళ్తున్న మినీ వ్యాన్ వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో మినీ లారీ డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VKB: తాండూర్ నుంచి పెద్దేముల్ వెళ్ళే రోడ్డు మార్గం గుంతలతో అధ్వానంగా మారడంతో ప్రయాణీకులు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో గర్భిణులు, రోగులను ఆసుపత్రికి తరలించడంలో రోడ్డు పరిస్థితి ప్రాణసంకటంగా మారిందని స్థానికులు తెలిపారు. వాహనదారులు, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులను సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు.
ADB: రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని SP అఖిల్ మహాజన్ తెలియజేశారు. జిల్లాలో ప్రమాదాలను నివారించడానికి మొట్టమొదటిసారిగా ‘ఖాకీ కిడ్స్’ పేరుతో నూతన కార్యక్రమాన్ని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శనివారం లాంచనంగా ప్రారంభించారు. విద్యార్థులకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
VZM: అనకాపల్లి జిల్లా బత్తివానిపాలెం వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయనగరం జిల్లా రాచకిండాం గ్రామానికి చెందిన లావణ్య మృతి చెందింది. సోదరుడి పెళ్లి వేడుక అనంతరం నూతన వధూవరులతో నిన్న శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లావణ్య మృతి చెందగా నవ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ‘పుష్ప 2’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకోవడంతో ఆయన ఖాతాలో మొత్తం 7 అవార్డులు చేరాయి. దీనితో అత్యధిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న నటుడిగా మెగాస్టార్ చిరంజీవి రికార్డును బన్నీ సమం చేశాడు. యంగ్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక నటుడిగా అల్లు అర్జున్ ఇప్పుడు టాప్‌లో నిలిచాడు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం అన్నికంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,043 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,299 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
W.G: కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన MLC అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పట్లో డీఎస్పీ, ప్రస్తుతం జిల్లా ఏఎస్పీగా ఉన్న భీమరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
PDPL: సింగరేణి సంస్థ 6 జిల్లాలలో 2025-26 ఆర్థిక సంవత్సర టార్గెట్ 72 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తిని చేరుకోవడానికి అధికారులు, ఉద్యోగులు కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 51.70MT బొగ్గు ఉత్పత్తి చేయబడి, 82% రీచ్ నమోదు అయింది. మార్చి చివరిలో 20.30MT బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉన్నందున, అధికారులు ఉత్పత్తిని పెంచడానికి ప్రత్యేక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
VSP: చింతపల్లి మండలంలో మొత్తం 16,127మంది రైతులకు గాను ఇప్పటి వరకూ 9,600మంది రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేశామని ఏవో మధుసూదనరావు తెలిపారు. పెండింగ్లో ఉన్న 6,527మందికి రైతులకు త్వరలో పూర్తి చేస్తామన్నారు. గెంజిగెడ్డ గ్రామంలో పర్యటించారు. ఆర్ఎస్కే సిబ్బందితో కలిసి రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ చేశారు. ఫార్మర్ రిజిస్ట్రీ గడువు దగ్గర పడుతుందన్నారు.
SKLM: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో టెక్కలి MLA, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం తిరుపతిలో మర్యాదపూర్వకంగా భేటీఅయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగా భివృద్ధి, రైతుల సంక్షేమ పథకాల అమలు పై చర్చించారు. ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాలని అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రిని కోరారు.
ఒడిశా ఝార్సుగూడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే-44పై పోలీస్ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారాన్ని అందించినట్లు ఎస్పీ రాఘవేంద్ర వెల్లడించారు.