ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలోనూ భారత మహిళా జట్టు ఓటమిపాలైంది. 299 పరుగుల లక్ష్య ఛేదనలో 215 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. దీంతో స్మృతి మంధాన (105) శతకం వృథా అయింది.
AP: 2024-29 ఏపీ మారిటైమ్ పాలసీని ప్రభుత్వం విడుదల చేసింది. భారీగా పెట్టుబడులు ఆకర్షించేలా కొత్త విధానం రూపొందించింది. సుదీర్ఘ తీరప్రాంతం.. పోర్టులు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి ఉపయోగపడేలా ఉంది. పోర్టు ఆధారిత అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు సేవలందించేలా పాలసీని రూపొందించారు. షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, లాజిస్టిక్స్, ఇతర మారిటైమ్ సేవలు అందించనున్నారు.
KMR: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను గణితంలో ప్రోత్సహించడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్నారు. జిల్లాస్థాయి గణిత ప్రతిభా పరీక్ష సందర్భంగా బుధవారం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతిభ పరీక్ష ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయవచ్చని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య పాల్గొన్నారు.
NLR: భారత అంతరిక్ష రంగంలో గత ఐదేళ్లలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలియజేయాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. బుధవారం లోక్‌సభలో ఆయన పలు అంశాలపై వివరాలు ఆరా తీశారు. ఇస్రోతో భాగస్వామ్యం కలిగి ఉన్న ప్రైవేటు కంపెనీల జాబితాను తెలియజేయాలని కోరారు.
KDP: ఈనెల 13న రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం సాయంత్రం వైసీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్న రైతులు, వైసీపీ కార్యకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ప్రతి ఒక్కరూ సభను విజయవంతం చేయాలని మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు కోరారు.
WNP: హైదరాబాద్ జల సౌదాలో బుధవారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు. మేఘారెడ్డి మాట్లాడుతూ.. బుద్ధారం, ఖిల్లాగణపురం, గణపసముద్రం రిజర్వాయర్, పలు కెనాల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంపై సుదీర్ఘంగా చర్చించారు.
WGL: నగరాభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్ భద్రకాళి చెరువు, విమానాశ్రయం తదితర అంశాలపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు పనులు యుద్ధప్రాతిపదికన జరపాలని, ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
కృష్ణా: జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తున్నట్లు YCP నేత పోతిన మహేశ్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఇంట్లో గొడవని వీధిలోకి తెచ్చుకుని మీడియా సిబ్బందిపై దాడికి చేయడం సరికాదన్నారు. గాయపడ్డ విలేఖరి రంజిత్ త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. మోహన్ బాబుపై చట్టపరంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
AP: వాహనాదారులు హెల్మెట్ ధరించటాన్ని అమలు చేయకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. పోలీసుల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టింది. ఈ ఏడాది జూన్- సెప్టెంబర్ వరకు 667 మంది హెల్మెట్ లేకపోవటం వల్ల మృతి చెందారని పిటిషనర్ తెలిపారు. రవాణా శాఖ కమిషనర్‌ను సుమోటోగా ఇంప్లీడ్ చేసింది. వారంలోగా కౌంటర్ వేయాలని ఆదేశింది. తదుపరి విచారణ వచ్చే...
NLR: నెల్లూరు రూరల్ పరిధిలోని 30 డివిజన్‌లో బుధవారం రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ నగర్‌ని అభివృద్ధి చేసేందుకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు, రోడ్డు విస్తరణలో భాగంగా విద్యుత్ స్తంభాలు మార్చే పని పూర్తి చేసి, రోడ్డు పనులు పూర్తి చేస్తారని అన్నారు.
SRPT: క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని తహసీల్దార్ హిమబిందు అన్నారు. అనంతగిరి మండల శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను వెలికి తీయడానికి సీఎం కప్ క్రీడలను ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు.
NGKL: కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలంలో అంబేడ్కర్ విగ్రహం ముందు అచ్చంపేటలో జరగబోయే సీపీఎం 3వ సభ గోడ పత్రికలను జిల్లా కార్యదర్శి ఈశ్వర్ పార్టీ నాయకులతో కలిసి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ.. కార్మికుల, కర్షకుల కోసం నిరంతరం పనిచేస్తున్న పార్టీ మూడో మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 15,16 తేదీలలో నిర్వహించే గ్రూప్-2 పరీక్షకు 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో చీఫ్ సూపరిండెంట్‌లు, అబ్సర్వర్లు, లోకల్ రూట్ ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. గ్రూప్-2 పరీక్షకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
KRNL: ఆదోని ఎంసీఎచ్ హాస్పిటల్‌ను 50 పడకల నుండి 100 పడకల ఆస్పత్రిగా వెంటనే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. బుధవారం విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారిని శిరీషను కలిసి వినతిపత్రం అందించారు. కేవలం 50 పడకలో ఉండడం కారణంగా ఆసుపత్రిలో సరైనటువంటి వైద్యం అందించలేకపోతున్నారని గుర్తు చేశారు.