W.G: తాడేపల్లిగూడెం పట్టణంలోని భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో బుధవారం డాక్టర్ అల్లు శ్రీ కృష్ణ మహేష్ దివ్యాంగుల పిల్లలకు ఫిజియోథెరపీ నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఇందులో ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్‌కే బాల ఈశ్వరయ్య, ఎం చంద్ర కుమారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి జ్యోతి పాఠశాల ఉపాధ్యాయిని కే కుమారి పాల్గొన్నారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీషెడ్యూల్ విడుదలైంది. డిగ్రీ 1వ సెమిస్టర్, 5వ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 25 నుంచి జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఈ పరీక్షలను డిసెంబర్ 21 నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు బుధవారం వెల్లడించారు.
WGL: వర్ధన్నపేట పట్టణంలో గురుస్వామి దీకొండ యుగంధర్ ఆధ్వర్యంలో బుధవారం అంగరంగ వైభవంగా మహాపడిపూజ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గదస్వామి చందు అశోక్ పడి ముట్టించి అయ్యప్ప స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప స్వాముల భజనతో పడిపూజ ప్రాంగణం అయ్యప్ప శరణు ఘోషతో మారుమరోగింది. అనంతరం వచ్చిన భక్తులకు అయ్యప్పస్వామి తీర్థప్రసాదాలు అందజేశారు.
కృష్ణా: నూజివీడులో ఈ 20న ట్రిపుల్ ఐటీలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఏపీ ఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్‌ను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలో 40 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు.
MHBD: ఈనెల 26, 27 తేదీలలో జిల్లా కేంద్రంలో జరుగు SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతూ ఆయన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వినర్ పట్ల మధు తదితరులు పాల్గొన్నారు.
ATP: గుత్తి మున్సిపాలిటీలోని పలు వార్డులో ఇంటింటికి తిరుగుతూ వసూలు చేస్తున్న ప్రాపర్టీ టాక్స్ ప్రక్రియను బుధవారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పరిశీలించారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ టాక్స్ సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని వార్డు ప్రజలకు సూచించారు.
ప్రకాశం: తమిళనాడులోని అరుణాచలంలో నిర్వహిస్తున్న కార్తీక మహాదీపాన్ని దర్శించుకునేందుకు వెళ్లే జిల్లా వాసులకు ఎస్పీ దామోదర్ పలు సూచనలు చేశారు. తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన ట్రాఫిక్ నిబంధనలను వివరించారు. తిరుపతి, చిత్తూరు రూట్లనుంచి వెల్లూరు రోడ్డు మీదుగా వచ్చే బస్సులకు తిరువణ్ణామలై బైపాస్ రోడ్డు వద్ద దీపం నగర్ జంక్షన్ సమీపంలో తాత్కాలిక బస్టాండ్‌లు ఏర్పాటు చేశారన్నారు.
NRML: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజి కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో క్రియాశీల సభ్యత్వాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా రైల్వేల ప్రైవేటీకరణ జరుగుతుందంటూ ప్రతిపక్షాలు తప్పుడు కథనాలు తెరపైకి తెచ్చాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మండిపడ్డారు. రైల్వేల ప్రైవేటీకరణ వంటి అంశం లేదని స్పష్టం చేశారు. రైల్వే బోర్డు పనితీరును మరింత మెరుగుపర్చడంతోపాటు స్వతంత్రతను పెంపొందించేలా రైల్వే సవరణ బిల్లు తీసుకొచ్చినట్లు తెలిపారు.
KDP: విభజన హామీలలో భాగంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు కావాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరనాల శివ నారాయణ తెలిపారు. పార్లమెంటులో కడప ఉక్కు పైన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వ్యాఖ్యలు నిరసిస్తూ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు జమ్మలమడుగులోని మహాత్మగాంధీ సర్కిల్లో నిరసన తెలియజేశారు.
HYD: పదేళ్ల KCRపాలనలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారని, తమ ఏడాది పాలనలోనే రికార్డు స్థాయిలో ఉద్యోగాల కల్పన, అభివృద్ధి చేసి చూపెట్టామని TPCCమీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. HYDలోని గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. ‘KTRకు పిచ్చెక్కిందా..?తెలంగాణ తల్లిని మార్చిన నీ అయ్యను వెళ్లి అడుగు.. TGని తల తిక్కలోడిలాగా TSగా KCR మార్చిండు’ అని అన్నారు.
HYD: పదేళ్ల KCRపాలనలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారని, తమ ఏడాది పాలనలోనే రికార్డు స్థాయిలో ఉద్యోగాల కల్పన, అభివృద్ధి చేసి చూపెట్టామని TPCCమీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. HYDలోని గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. ‘KTRకు పిచ్చెక్కిందా..?తెలంగాణ తల్లిని మార్చిన నీ అయ్యను వెళ్లి అడుగు.. TGని తల తిక్కలోడిలాగా TSగా KCR మార్చిండు’ అని అన్నారు.
కేసీఆర్ దీక్ష ఫలితంగానే డిసెంబర్- 9న ప్రకటన వచ్చిందని, నవంబర్-29 లేకుంటే డిసెంబర్-9 లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణకు నెం.1 విలన్ కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు. ఉద్యమాలను అనచివేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ దమనకాండకు నిదర్శనమే గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపమన్నారు. తెలంగాణను కాంగ్రెస్ నేతలు పదవుల కోసమే వాడుకున్నారన్నారు.
KDP: దువ్వూరు మండలంలోని కేసీ ఆయకట్టు సాగు నీటి సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం ఎలక్షన్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి విడుదల చేశారు. WA60 పరిధిలోని గ్రామాలైన దువ్వూరు, పెద్దజొన్నవరం, నెలటూరు, జిల్లెల్లతో పాటు రాజుపాలెం మండలంలో 14న ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్ పత్రాన్ని సచివాలయాల్లో ప్రదర్శించారు.
AP: ఇన్నోవేటివ్ ఎకానమీలో ఏపీలో కొన్ని జిల్లాలు ముందంజలో ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కోనసీమ లాంటి జిల్లా ఇన్నోవేటివ్ ఎకానమీలో వెనుకంజలో ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా జిల్లాలు కూడా అభివృద్ధిలో ముందంజవేయాలి. వ్యవసాయం ఒక్కటే ఏ రాష్ట్రాన్నీ లేదా జిల్లాను ముందుకు నడిపించలేదని స్పష్టం చేశారు. సర్వీస్ సెక్టార్, నాలెడ్జి ఎకానిమీలో ఎంత అభివృద్ధి చెందితే అంత మంచిదని పేర్కొన్నారు.