• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే’

ప్రకాశం: ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని మార్కాపురం శివారులో వెలసిన శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఆదివారం కావడంతో భక్తులు రద్దీ అధికంగా ఉండడంతో పోలీసులు పట్టిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 12:00 PM IST

మహిళలను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్

సత్యసాయి: కదిరిలో టాటూ షాపు నిర్వహిస్తూ మహిళలను వేధిస్తున్న పవన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జల్సాల కోసం నాటు సారా విక్రయిస్తున్నట్లు గుర్తించి అతని నుంచి స్కూటీ, నిషేధిత సారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి సబ్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. అలాగే అతనిపై రౌడీ షీట్ తెరిచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

February 22, 2026 / 12:00 PM IST

కామారెడ్డి, బాన్సువాడలో 163 సెక్షన్: SP

KMR: శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడలో 163 BNSS (పాత సెక్షన్ 144) అమలు చేస్తున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, ఆయుధాలు ధరించడం నిషేధమని హెచ్చరించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, పోలీసు విధి నిర్వహణ, అత్యవసర వైద్య సేవలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు.

February 22, 2026 / 11:57 AM IST

క్యాతనపల్లిలో కొనసాగుతున్న BRS, కాంగ్రెస్‌ల ఆరోపణలు

TG: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపణల పర్వం కొనసాగుతోంది. సింగరేణి అధికారులను తమపై అస్త్రంగా వాడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఇళ్లను కబ్జా పేరుతో స్వాధీనం చేసుకుంటున్నారని, సీపీఐ కౌన్సిలర్లపై ఇదే ప్రయోగం చేస్తున్నారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. అయితే, తమకు ఆ అవసరం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

February 22, 2026 / 11:57 AM IST

రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. అలాగే, GHMC ఎన్నికలతో పాటు MPTC, ZPTC ఎన్నికలపై చర్చిస్తారు. రైతు భరోసా నిధుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలి దశ టేకోవర్‌పైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

February 22, 2026 / 11:57 AM IST

నో హెల్మెట్-నో పెట్రోల్: కలెక్టర్

భువనగిరి: జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు కలెక్టర్ హనుమంతరావు కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చారు. ఇకపై హెల్మెట్ లేని బైక్‌లకు పెట్రోల్ పోయకూడదని బంక్ యాజమాన్యాలను‌ ఆదేశించారు. ప్రతి బంక్ వద్ద హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

February 22, 2026 / 11:55 AM IST

ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వం స్థలం ?

వనపర్తి: వీపనగండ్లలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా సర్వే నెంబర్ 721 ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు పార్టీలకతీతంగా నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేసి, హద్దులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 11:54 AM IST

ప్రజాప్రతినిధులకు సామాజిక సేవా నాయకులు సన్మానం

BDK: కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇటీవల ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సామాజిక సేవా నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ సన్మానించారు. కొత్తగూడెం మేయర్‌గా ఎన్నికైన మూడు గణేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే సీపీఐ పార్టీ తరఫున 50వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన దాసరి శీనన్నను కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన కేకేను సత్కరించారు.

February 22, 2026 / 11:53 AM IST

ఈ నెల 24న కాణిపాకం హుండీ లెక్కింపు

CTR: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ కానుకలను ఈ నెల 24న లెక్కించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించే హుండీ కానుకల లెక్కింపునకు ఆలయ అధికారులు, సిబ్బంది హజరు కావాలని కోరారు.

February 22, 2026 / 11:50 AM IST

నంద్యాలలో ఘనంగా శివరామకృష్ణ జన్మదిన వేడుకలు

నంద్యాలలో గోళ్ళ రాజేష్ కార్యాలయంలో సీనియర్ పాత్రికేయుడు శివరామకృష్ణ (RK9 NEWS ఎడిటర్) జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఆనందంగా నిర్వహించారు. ఈ సందర్భ ఇవాళ పలువురు పాత్రికేయులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉస్మాన్ భాష, మస్తాన్, నూర్ భాషా, కుమార్, శ్రీనివాసులు, భరత్ తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 11:50 AM IST

బాలకృష్ణ ఇంటి దగ్గర రోడ్డు ప్రమాదం

TG: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సినీ నటుడు బాలకృష్ణ ఇంటి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అతివేగంగా వచ్చి పక్క రోడ్లోకి దూసుకెళ్లి కార్లు, బైకులను ఢీకొట్టింది. పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై వాహనాలు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 11:50 AM IST

కాజిపేటలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన

హనుమకొండ జిల్లా కాజిపేట మండల కేంద్రలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదివారం సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పధకాలను శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన రెండు సంవత్సరాల తర్వాత చేసిన పనులపై కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ శ్రీ, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 22, 2026 / 11:48 AM IST

రేపటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణ

MBNR: జడ్చర్ల మండలంలోని 15 గ్రామాలకు చెందిన నూతన వార్డు సభ్యులకు సోమవారం నుంచి ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. మొదటి బ్యాచ్ కింద ఆలూరు బూరుగుపల్లి, ఉదండాపూర్, చెర్లపల్లి సహా పలు తండాల ప్రతినిధులకు ఈ శిక్షణ ఉంటుంది. క్షేత్రస్థాయిలో పాలన, అధికారాలపై అవగాహన కల్పించడమే ఈ తరగతుల ముఖ్య ఉద్దేశం హాజరు కావాలని అధికారులు సూచించారు.

February 22, 2026 / 11:48 AM IST

జాతీయ సమైక్యత శిబిరానికి మైదుకూరు విద్యార్థి ఎంపిక

KDP: మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS వాలంటీర్ ఏ.బాలు, బెలగావిలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 2 వరకు జరిగే జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికయ్యారు. ఈ శిబిరంలో ఆయన YVU తరపున APకు ప్రాతినిధ్యం వహిస్తారు.ప్రిన్సిపాల్ డా.పి.నారాయణరెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. జాతీయ స్థాయిలో బాలు ఎంపిక కావడం పట్ల NSS పీవో డా. కృష్ణారెడ్డి,అధ్యాపకులు,విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

February 22, 2026 / 11:47 AM IST

కోట్ల వారి పల్లెలో శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట

NDL: డోన్ పట్టణ పరిధిలో కోట్ల వారి పల్లెలో శ్రీ గంగ గంగమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన నేడు పాల్గొన్నారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

February 22, 2026 / 11:46 AM IST