• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చిన్న సూరారంలో సర్వేను తనిఖీ చేసిన కలెక్టర్

నల్గొండ: నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సర్వే బృందాలకు సూచించారు. బుధవారం ఆమె నల్గొండ మండలం చిన్న సూరారం గ్రామపంచాయతీలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన సర్వేను తనిఖీ చేశారు. సర్వే బృందాలతో మాట్లాడుతూ.. ఇంటి యజమానుల పూర్తి వివరాలను సేకరించాలన్నారు.

December 12, 2024 / 04:02 AM IST

నేడు DVMC కార్యక్రమంలో పాల్గోననున్న ప్రభుత్వ విప్

PPM: ప్రభుత్వ విప్‌ & కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి గురువారం పార్వతీపురం మన్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే డిస్ట్రిక్ట్‌ విజిలెన్స్‌ & మోనిటరింగ్‌ కమిటీ (DVMC )సమావేశంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశాయి.

December 12, 2024 / 04:01 AM IST

లారీ బోల్తా.. ఇద్దరికి గాయాలు

KDP: నెల్లూరు జిల్లా సీతారాంపురం నుంచి కడప జిల్లా పోరుమామిళ్ల మండలానికి రోడ్డు రోలర్‌ను తీసుకువస్తున్న లారీ టేకూరుపేట సమీపంలోని ఘాట్ రోడ్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు రోలర్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

December 12, 2024 / 04:01 AM IST

పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలి: DEO

GNTR: పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక సూచించారు. సమ్మేటీవ్ అసెస్మెంట్ టర్మ్-1 పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో నగరంలోని స్టాల్ బాలికల ఉన్నత పాఠశాల, పట్టాభిపురం నగరపాలక ఉన్నత పాఠశాలను బుధవారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు.

December 12, 2024 / 04:01 AM IST

ఎమ్మెల్యే చేతుల మీదుగా కుట్టు మిషన్ల ఆందజేత

KDP: ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. దాదాస్ సంస్థలో శిక్షణ పొందిన అభాగ్యుల శక్తి సదన్ మహిళలకు కడపలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలని, తమకాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని అన్నారు.

December 12, 2024 / 04:00 AM IST

‘బీఫ్ అందించని రెస్టారెంట్లను బ్యాన్ చేయాలి’

బంగ్లాదేశ్‌లో బీఫ్ అందించని రెస్టారెంట్లను బ్యాన్ చేయాలంటూ ముస్లీం వినియోగదారుల హక్కుల మండలి భారీ ర్యాలీ చేపట్టింది. రెస్టారెంట్ల మెనూలో కచ్చితంగా బీఫ్ వంటకాలు చేర్చాలని పిలుపునిచ్చింది. కొన్ని రెస్టారెంట్లు బీఫ్‌ను బ్యాన్ చేస్తున్నాయని, అలాంటి వాటిని హిందుత్వ అనుకూలత రెస్టారెంట్లుగా భావించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆ తర్వాత దేశవ్యాప్త బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది.

December 12, 2024 / 03:41 AM IST

డిసెంబర్ 12: టీవీలలో సినిమాలు

జీ తెలుగు: ఇద్దరమ్మాయిలతో (9AM), పెళ్లి రోజు (11PM); ఈటీవీ: కలసి నడుద్దాం (9AM); జెమినీ: దేవుళ్లు (8.30AM), బాష (3PM); స్టార్ మా మూవీస్: ఝాన్సీ (7AM), ఓ బేబీ (9AM), వినయ విధేయ రామ (12PM), స్వామి-2 (3PM), విరూపాక్ష (6PM), యోగి (9PM); జీ సినిమాలు: నీకు నేను నాకు నువ్వు (7AM), కథానాయకుడు (9AM), ముత్తు (12PM), శివాజి (3PM), బింబిసార (6PM), చిరుత (9PM).

December 12, 2024 / 03:25 AM IST

డిసెంబర్ 12: గురువారం పంచాంగం

శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం ద్వాదశి: రా.8-21. తదుపరి త్రయోదశి; అశ్విని: ఉ. 8-23 తదుపరి భరణి; వర్జ్యం: సా. 5-20 నుంచి 6-50 వరకు; అమృత ఘడియలు: రా. 12-18 నుంచి 3-48 వరకు; దుర్ముహూర్తం: ఉ. 10-03 నుంచి 10-47 వరకు; తిరిగి మ. 2-27 నుంచి 3-11 వరకు; రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ. 6.24; సూర్యాస్తమయం: సా.5.23

December 12, 2024 / 03:03 AM IST

ప్రపంచ రికార్డు సృష్టించిన మస్క్

అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచ రికార్డు సృష్టించాడు. వ్యక్తిగత సంపాదనలో మొట్టమొదటిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరి చరిత్రకెక్కాడు. ఇటీవల స్పేస్‌ఎక్స్‌లోని కొంత వాటాను మస్క్ విక్రయించాడు. దీంతో ఆయన సంపాదన దాదాపు 50 బిలియన్ డాలర్లు పెరిగి.. 439.2 బిలియన్ డాలర్లకు చేరకుంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ తెలిపింది.

December 12, 2024 / 02:43 AM IST

డిసెంబర్ 12: చరిత్రలో ఈరోజు

1905: భారతీయ ఆంగ్ల రచయిత ముల్క్ రాజ్ ఆనంద్ జననం,1911: హైదరాబాద్‌ను పాలించిన 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ మరణం,1945: హస్యనటుడు నూతన ప్రసాద్ పుట్టినరోజు,1950: భారతీయ సినీ నటుడు రజనీకాంత్ పుట్టినరోజు,1981: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పుట్టినరోజు,అసోం రైఫిల్స్ స్థాపన దినోత్సవం.

December 12, 2024 / 02:25 AM IST

యూజర్లకు మెటా క్షమాపణలు

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, థ్రెడ్స్‌ సేవల్లో అంతరాయం ఏర్పడడంపై మెటా స్పందించింది. సాంకేతిక సమస్యతో తమ యాప్స్‌ను పలువురు యూజర్లు వినియోగించుకోలేకపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. సాధ్యమైనంత త్వరగా సేవలను పునరుద్ధరించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భగా తమ సేవల్లో అంతరాయం నెలకొన్నందుకు యూజర్లకు క్షమాపణలను చెప్పింది.

December 12, 2024 / 02:05 AM IST

బెయిల్‌పై వచ్చి.. బాధితురాలిని హత్య చేసి!

ఓ బాలికపై అత్యాచార కేసులో జైలుకెళ్లిన నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చి.. బాధితురాలిని హత్య చేసిన వైనం ఒడిశాలో జరిగింది. కును కిశాన్ అనే వక్తి సుందర్‌గఢ్ జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలికను అత్యాచారం చేయడంతో జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన అతను ఆ బాలికను హత్య చేసి.. ఆమె శరీర భాగాలను వేర్వేరు చోట్ల విసిరేశాడు. బాలిక అదృశ్యంపై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం...

December 12, 2024 / 01:43 AM IST

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ సేవల్లో అంతరాయం

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, థ్రెడ్స్‌ సేవల్లో అంతరాయం కలుగుతున్నట్లు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ మెసేజ్‌లు వెళ్లడం లేదని, లాగిన్ అవ్వడం లేదని వేలాది మంది యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. 50వేల మందికి పైగా ఫేస్‌బుక్‌ యూజర్లు, 23వేల మందికి పైగా ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

December 12, 2024 / 01:25 AM IST

బీఫ్ అందించని రెస్టారెంట్లను బ్యాన్ చేయాలంటూ ర్యాలీ

బంగ్లాదేశ్‌లో బీఫ్ అందించని రెస్టారెంట్లను బ్యాన్ చేయాలంటూ ముస్లీం వినియోగదారుల హక్కుల మండలి భారీ ర్యాలీ చేపట్టింది. రెస్టారెంట్ల మెనూలో కచ్చితంగా బీఫ్ వంటకాలు చేర్చాలని పిలుపునిచ్చింది. కొన్ని రెస్టారెంట్లు బీఫ్‌ను బ్యాన్ చేస్తున్నాయని, అలాంటి వాటిని హిందుత్వ అనుకూలత రెస్టారెంట్లుగా భావించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆ తర్వాత దేశవ్యాప్త బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది.

December 12, 2024 / 01:25 AM IST

భారత్‌లో తగ్గిన మలేరియా మరణాలు

భారత్‌లో గణనీయంగా మలేరియా మరణాలు తగ్గినట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. మలేరియా మరణాలు, వ్యాప్తిని భారత్‌ గణనీయంగా తగ్గించగలిగిందని కొనియాడింది. 2017లో 64 లక్షల మలేరియా కేసులు నమోదైనట్లు తెలిపిన డబ్ల్యూహెచ్‌వో.. 2023 నాటికి 20 లక్షలకు తగ్గినట్లు ఓ నివేదికలో వెల్లడైందని తెలిపింది. మరణాలు సైతం 11,100 నుంచి 3500కు తగ్గినట్లు చెప్పింది.

December 12, 2024 / 01:03 AM IST