TG: యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు మూడోరోజు కొనసాగుతున్నాయి. ఉదయం స్వామివారికి మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు స్వామివారికి శేషవాహన సేవ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు కనువిందు చేయనున్నాయి.
SKLM: మెళియాపుట్టి విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టెక్కలి డివిజనల్ విద్యుత్ అధికారి నర్సింహ కుమార్ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిడ్డిమి, చాపర గ్రామీణ, పారిశ్రామిక పీడర్ల పరిధిలో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించి, విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు.
VKB: ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ పరిరక్షణకు హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన మహనీయుడని BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోటిగారి శివరాజ్ పేర్కొన్నారు. నిన్న వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి హనుమాన్ దేవాలయం నుంచి వికారాబాద్ పట్టణంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తా ఆంజనేయస్వామి ఆలయం వరకు శివాజీ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు.
కోనసీమ: దరియాలతిప్ప పరిధిలోని పంట పొలాలకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని కోరుతూ రైతులు గురువారం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక న్ను కలిశారు. సాగు నీరు అందక పోవడంతో ఎదిగిన పైరు ఎండిపోయే దశకు చేరుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, వెంటనే అధికారులతో మాట్లాడారు. సాగునీరు అందించాలని అధికారులకు సూచించారు.
PPM: జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి గురువారం కలక్టరేట్‌లో సివిల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగుల, ఉపాద్యాయుల సమస్యల పరష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగులకు ఏ రకమైన సమస్యలు ఉన్నా సంకోచించకుండా నేరుగా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు.
NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ.1 కోటి 64 లక్షల వ్యయంతో నిర్మించనున్న కర్మల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమా శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ భవన నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KDP: ప్రొద్దుటూరు నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ విశ్వనాథ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళా భద్రత, గంజా నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్ల కదలికలపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ATP: రైలు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కదిరిదేవరపల్లి – తిరుపతి ప్యాసింజర్ రైలు కళ్యాణదుర్గం స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. గురువారం కదిరిదేవరపల్లి నుంచి బయల్దేరిన ఈ రైలులో కొద్దిదూరం వెళ్ళాక సమస్య ఏర్పడటంతో, సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేసి కళ్యాణదుర్గం స్టేషన్‌కు చేర్చారు. దీంతో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
TG: ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజే ఇంజినీరింగ్ విభాగానికి 1,950 మంది, అగ్రికల్చర్‌కు 1,430, రెండింటికి కలిపి ఐదుగురు.. మొత్తంగా 3,385 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామని ఎప్‌సెట్ కన్వీనర్ ఆచార్య విజయకుమార్ రెడ్డి వెల్లడించారు. విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అన్నమయ్య: రైల్వేకోడూరులోని బోటుమీదపల్లె రైల్వే ట్రాక్ సమీపంలో నిన్న దేశయ్యపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గత 15 రోజులుగా ఓబులవారిపల్లె, కోడూరు మండల పరిసర గ్రామాల్లో రెండు ఎలుగుబంట్లు ప్రజలపై దాడులు చేస్తున్నాయి. గ్రామస్తులు అటవీశాఖ చర్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
SRD: జిల్లా రంజాన్ మాసంలో ప్రపంచంలోని ప్రతి ముస్లీం ఐదు ప్రాతమిక విధులను తప్పనిసరిగా నిర్వహించాలని ఇమామ్ నయ్యర్ అజాం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇమాన్, నమాజ్, జకాత్, రోజా, హజ్ అనే విధులను విధిగా నిర్వహించాలి. ఇమాన్ భగవంతుడైన అల్లాహ్‌పై పూర్తిగా విశ్వాసం ఉంచాలని, నమాజ్, ఎనిమిదేళ్లు దాటిన వారు విధిగా 5 సార్లు నమాజ్ చేయాలని తెలిపారు.
SS: గోరంట్ల పోలీస్ స్టేషన్‌ను అడిషనల్ ఎస్పీ అంకిత సురాన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, లాకప్ గది, మహిళా హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించి కేసుల పురోగతిపై ఆరా తీశారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేరాల నియంత్రణకు రాత్రి బీట్లు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎస్సైలు రామచంద్ర, ఉమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
KMM: మధిర బోడెపుడి భవన్‌లో సీపీఎం పార్టీ డివిజన్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ప్రజలు నమ్మి స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి విజయాన్ని అందించిందన్నారు. ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేయొద్దని హితవు పలికారు.
TPT: పుత్తూరు ప్రాంతానికి చెందిన ఓ బాలికను తిరుపతికి చెందిన యువకుడు యూసఫ్ (23) మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అఘయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ ఏడాది ఏప్రిల్ 1న నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి 110 కిలోల ముత్యాలను కానుకగా ఇచ్చేందుకు నెల్లూరు జిల్లా కోవూరు MLA,TTD పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు లోక్ సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ముందుకొచ్చినట్లు డిప్యూటీ ఈవో ఏ.ప్రశాంతి గురువారం తెలిపారు.