• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బీజేవైఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి

SKLM: బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ధన్నాన మదన్ నేతృత్వంలో శ్రీకాకుళంలోని అరసవిల్లి జంక్షన్‌లో ఇందిరా భవన్ వద్ద బీజేపీ నాయకులు శనివారం సాయంత్రం నిరసన చేపట్టారు. న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో కాంగ్రెస్ యూత్ వింగ్ సభ్యుల ప్రవర్తనను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధ్యక్షులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

February 21, 2026 / 08:19 PM IST

T20 WC సూపర్-8: రేపు భారత్ vs సౌతాఫ్రికా

సూపర్-8లో భాగంగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య రేపు కీలక పోరు జరగనుంది. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని సౌతాఫ్రికా భావిస్తోంది. మరోవైపు భారత్ తన విజయాల పరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉంది. కాగా, T20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్‌తో సఫారీలు 7 సార్లు తలపడగా.. 5 సార్లు టీమిండియానే విజయం సాధించింది.

February 21, 2026 / 08:19 PM IST

చిత్తూరు ఎమ్మెల్యే రేపు పర్యటన షెడ్యూల్

CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం పుత్తూరు రోడ్డులో మెడికల్ కోడింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం, పీవీపీఎన్ కళాశాలలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం, ఆఫీస్ బస్టాండ్ వద్ద పార్టీ భవన భూమిపూజ, రాజీవ్ కాలనీలో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

February 21, 2026 / 08:17 PM IST

సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

HNK: నగరంలోని గిరిజన భవన్‌లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా సేవాలాల్ చిత్రపటం వద్ద MLA కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించారు.

February 21, 2026 / 08:17 PM IST

కుటుంబసభ్యులు మందలించారని యువకుడు ఆత్మహత్య

ASF: వాంకిడి మండలం బనార్కోసారలో కుటుంబ సభ్యులు మందలించారనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI మహేందర్ వివరాల ప్రకారం.. నాగేషే రవీందర్ మద్యానికి బానిసై పనికి వెళ్లకుండా తిరుగుతుండటంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన అతను ఇంట్లో చీరతో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 08:16 PM IST

భాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం

VZM: గంట్లాం గ్రామంలో నివాసం ఉంటున్న చిట్టిబాబు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో గృహోపకరణాలు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోవడంతో కుటుంబానికి ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శనివారం ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తక్షణ సహాయంగా రూ.15,000 నగదు, సరుకులు ఇచ్చారు.

February 21, 2026 / 08:16 PM IST

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

NRPT: ఈనెల 25 నుంచి మార్చి 16 వరకు జరిగే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, ఎలాంటి తప్పులకు తావులేకుండా పరీక్షలు జరగాలని ఆమె ఆదేశించారు. మొదటి సంవత్సరం 4408 మంది, రెండో సంవత్సరం 3783 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.

February 21, 2026 / 08:15 PM IST

సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలి: కలెక్టర్

NGKL: జిల్లాలోని అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బిజినేపల్లి మండలం వట్టెం, రామిరెడ్డిపల్లిలో కొనసాగుతున్న మిషన్ భగీరథ తాగునీటి ఇంటింటి సర్వేను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.

February 21, 2026 / 08:15 PM IST

జిన్నింగ్ మిల్లుల్లో ఫిబ్రవరి 27 వరకు కొనుగోళ్లు

KMM: రైతులు తమ పత్తిని కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ చేసుకుని విక్రయించుకోవాలని అధికారులు ఇవాళ సూచించారు. జిల్లాలో 2025-26 సీజన్‌కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి కొనుగోలు గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగించినట్లు ఖమ్మం అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లుల్లో ఈ గడువు వరకు కొనుగోళ్లు జరుగుతాయి.

February 21, 2026 / 08:14 PM IST

ఏఐ సమ్మిట్‌కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు: చామల

TG: ఏఐ సమ్మిట్‌కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘ఏఐ సమ్మిట్‌తో ఉద్యోగాలు వస్తే స్వాగతిస్తాం. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలతో దేశానికి నష్టం. ట్రంప్ చేప్పినట్లే మోదీ నడుచుకుంటున్నారు. యువత, రైతుల గురించి మోదీ ఆలోచించడం లేదు. దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాలి’ అని పేర్కొన్నారు.

February 21, 2026 / 08:14 PM IST

స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన మంత్రి

ASR: కోటవురట్ల మండలానికి చెందిన స్వచ్ఛ రథాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిత నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో శనివారం సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల్లో పరిశుభ్రతకు స్వచ్ఛ రథాలు దోహదపడతాయన్నారు. పొడి చెత్తను తీసుకుని అవసరమైన నిత్యవసరం వస్తువులను స్వచ్ఛ రథాల ద్వారా పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:13 PM IST

బాలిక మిస్సింగ్.. ఛేదించిన పోలీసులు

KKD: ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 20వ తేదీన రాత్రి 17 ఏళ్ల బాలిక అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసిన ప్రత్తిపాడు SI ఎస్. లక్ష్మీకాంతం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలిక ఆచూకి కోసం వెతికారు. ఏర్పాటైన 8 గంటల్లో ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు ఇవాళ అప్పగించారు. 

February 21, 2026 / 08:09 PM IST

అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కమిటీ ఎన్నిక

SRCL: బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో శనివారం ఏడబ్ల్యూసీలో నూతనంగా ఆరోగ్యలక్ష్మి కమిటీ ఎన్నిక నిర్వహించారు. కమిటీ ఛైర్మన్‌గా సర్పంచ్ సంధ్య, ఉపసర్పంచ్ మారుతి, వీవో సంధ్య, లావణ్యలచే కమిటీ ఏర్పాటు చేశామని అంగన్వాడి సూపర్వైజర్ నిర్మల తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వరలక్ష్మి, అనూజ, తల్లులు, గర్భవతులు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:09 PM IST

మసీదు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన కౌన్సిలర్

HNK: పరకాల మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని మసీదు వద్ద స్ట్రీట్ లైట్లు, కొత్త డ్రైనేజ్ పనులను శనివారం సాయంత్రం నూతన కౌన్సిలర్ పడిదెల దీప్తి-రాకేష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇబ్బందులు లేకుండా రోడ్లు, లైట్లు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

February 21, 2026 / 08:08 PM IST

బాధితులకు సహాయ సహకారాలు: ఎస్పీ

MDK: లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలలకు భరోసా కేంద్రం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్ కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని సందర్శించి తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వాహణ పరిశీలించారు. ఫోక్సో కేసులు, లైంగిక వేధింపుల బాధితుల రక్షణకు చర్యలపై తెలుసుకున్నారు.

February 21, 2026 / 08:08 PM IST