• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

PSFI రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక

ATP: PSFI రాష్ట్ర మహాసభలు మూడు రోజుల పాటు అనంతపురంలోనీ వీకే భవన్లో ఘనంగా జరిగాయి. ఎంతో ఉత్తేజ పూరితమైన వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా అబ్దుల్ ఆలం, అధ్యక్షుడిగా జీవన్ కుమార్ ఎన్నికయ్యారు. సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని వారు తెలిపారు.

December 12, 2024 / 05:28 AM IST

‘ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు’

ATP: బొమ్మనహాల్ మండలంలో ఈనెల 14న సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తహశీల్దార్ మునివేలు అన్నారు. బొమ్మనహాల్లోని వెలుగు కార్యాలయంలో బుధవారం పీఓలు, ఏపీఓలతో సమావేశం నిర్వహించారు. సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలన్నారు.

December 12, 2024 / 05:27 AM IST

నీటిపారుదల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ATP: కనేకల్ మండలం బెనికల్ గ్రామ సచివాలయంలో బుధవారం బెనికల్ నీటిపారుదల సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎలక్షన్ ఆఫీసర్ ఆర్.భవాని శంకర్ విడుదల చేశారు. అర్హులైన రైతులు ఈనెల 14న జరిగే పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో బెనికల్ వీఆర్వో ఆదినారాయణ, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

December 12, 2024 / 05:25 AM IST

రెవిన్యూ సదస్సు లు సద్వినియోగం చేసుకోండి: జేసీ

ATP: కుడేరు మండలం కొర్రకోడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ హాజరయ్యారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

December 12, 2024 / 05:25 AM IST

కంకర క్వారీ మిషన్‌లో పడి కూలి మృతి

ATP: విడపనకల్ మండలం కడదరబెంచి వద్ద ప్రమాదవశాత్తు కంకర క్వారీ మిషన్‌లో పడి బీహార్ రాష్ట్రానికి చెందిన మనీశ్ (19) అనే కూలి మృతి చెందాడు. క్వారీ మిషన్ ఆన్‌లో ఉండగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అక్కడే ఉన్న తోటి కూలీలు గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

December 12, 2024 / 05:22 AM IST

ఇకపై 25 ఏళ్లు పైబడిన వారికే మద్యం!

ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై 25 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే మద్యం విక్రయించాలని ఆదేశించింది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీలలో వారి వయస్సును చెక్ చేసిన తర్వాతే అమ్మకాలు చేయాలని క్లబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేసింది. ఓన్లీ ఫిజికల్ ఐడీలు మాత్రమే చెక్ చేయాలని, వర్చువల్ ఐడీలను చెక్ చేయకూడదని తెలిపింది. దీనిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుక...

December 12, 2024 / 05:21 AM IST

మంచిర్యాలలో వందే భారత్ హల్టింగ్ కోసం కేంద్రమంత్రికి వినతి

MNCL: సికింద్రాబాద్-నాగపూర్ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆదాయపరంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ నాన్ సబర్బన్ గ్రేడ్ రైల్వే స్టేషన్ జాబితాలో 30వ స్థానంలో ఉందని గుర్తు చేశారు.

December 12, 2024 / 05:21 AM IST

జర్నలిస్టులపై దాడి సరికాదు: మంత్రి పొన్నం

HYD: నటుడు మోహన్ బాబు, వారి కుమారుడు వ్యక్తిగత పంచాయితీలో జర్నలిస్టుపై దాడి సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జర్నలిస్ట్ ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కలెక్టర్, వైద్య శాఖ అధికారులతో అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.

December 12, 2024 / 05:20 AM IST

గ్రామంలో వేగంగా సీసీ రోడ్డు నిర్మాణ ప్రజలు

BPT: సంతమాగులూరు మండలంలోని పాతమాగులూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులను శర వేగంగా జరుగుతున్నాయి. గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులను గ్రామ నాయకులు చల్లా కోటేశ్వరరావు, చల్లా నాగేశ్వరరావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వారిద్దరి సారధ్యంలో గ్రామంలో ఉన్నటువంటి సచివాలయం రోడ్డుతో పాటు చర్చి పనులు జరుగుతున్నాయి.

December 12, 2024 / 05:15 AM IST

ఎమ్మెల్యే కందికుంట నేటి పర్యటన వివరాలు

సత్యసాయి: నల్లచెరువు మండలంలో గురువారం కదిరి శాసన సభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పర్యటించనున్నారు. మండల పరిధిలోని పీ. కొత్తపల్లిలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుకు హాజరవుతారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

December 12, 2024 / 05:06 AM IST

సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ నియామకం

KNR: సుల్తానాబాద్ కోర్టు సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా సీనియర్ న్యాయవాది నేరెళ్ళ శంకరయ్యను నియమిస్తూ పెద్దపల్లి జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం సుల్తానాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి గణేష్ సమక్షంలో శంకరయ్య పదవీ బాధ్యతలు చేపట్టగా, జడ్జి, న్యాయవాదులు శంకరయ్యను సన్మానించారు.

December 12, 2024 / 05:03 AM IST

మంచు బ్రదర్స్‌ను హెచ్చరించిన సీపీ

కుటుంబ వివాదాలకు సంబంధించి విచారణకు హజరైన నటులు మంచు మనోజ్, విష్ణులను రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు హెచ్చరించారు. కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చవద్దని సూచించారు. శాంతియుతంగా కుటుంబ సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. మరోసారి ఎలాంటి సమస్యలు సృష్టించొద్దని, ఇంకోసారి గొడవలు చేస్తే మాత్రం తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.

December 12, 2024 / 05:01 AM IST

స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్-2047పై సమీక్ష

సత్యసాయి: స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్-2047పై జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 13న స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అవిస్కరిస్తున్న సందర్భంగా అందుకు సంబంధించిన సన్నద్ధతపై బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

December 12, 2024 / 05:01 AM IST

అందుబాటులో రాయితీపై వరి విత్తనాలు

MNCL: దండేపల్లి మండల రైతులకు యాసంగి పంట సాగుకు గాను కూనారం 1638 రకం వరి విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు ఏవో అంజిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాయితీపై అందించే విత్తనాలు అవసరం ఉన్న రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్సుతో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు.

December 12, 2024 / 05:00 AM IST

పేద విద్యార్థులకు సైకిల్స్ అందజేత

NLG: నల్గొండ మండలం ZPHS నర్సింగ్ బట్ల గ్రామంలో ఎన్వీడీఎస్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సహకారంతో నిరుపేద విద్యార్థులకు 7 సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్యాంసుందర్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ కోటిలింగం, నల్గొండ మండలం ఎంఈఓ అరుంధతి మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సైకిల్స్‌ను అందజేయడం అభినందనీయమని అన్నారు.

December 12, 2024 / 05:00 AM IST