RR: మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధిలో గల బడంగ్‌పేట్ డివిజన్‌లో ది మాస్టర్ మైండ్ స్కూల్ 5వ వార్షికోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. మాజీ మేయర్ మాట్లాడుతూ.. ఈ విద్యాసంస్థలు అంచలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు.
SKLM: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ రోడ్డులో శనివారం సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ద్విచక్రవాహనం పై 6 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న గంజాయిని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గంజాయి రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు ఉంటాయని సీఐ అన్నారు
ASR: జీ.మాడుగుల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు శనివారం ఫేర్ వెల్ పార్టీ నిర్వహించారు. ఇందులో బాగంగా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జీ.మాడుగుల ఏటీడబ్ల్యూవో నాగ శిరీష విద్యార్థులకు సూచించారు. సమయం వృథా చేయకుండా అన్ని సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
SRPT: నూతనకల్ మండలం పెద్దనేమిల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం-2లోని సదరు టీచర్ 19న సెలవులో ఉండి కూడా హాజరు పట్టీలో సంతకం చేశారని, 21న ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారని గ్రామస్థులు ఆరోపించారు. పిల్లల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని, బాధ్యత రహితంగా వ్యవహారిస్తున్న టీచర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
SRCL: జిల్లాలో ఈరోజు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన వాయిదా పడింది. గంభీరావుపేట మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన హాజరుకావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం రద్దయినట్లు డిప్యూటీ సీఎం ప్రైవేట్ సెక్రటరీ ప్రకటించారు. పర్యటనకు సంబంధించిన తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
KDP: వైసీపీ రాష్ట్ర అనుబంధ వింగ్ కమిటీ సభ్యులను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఇందులో భాగంగా కడప జిల్లా బీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబరుగా మైలవరం మండలం తొర్రి వేముల సుబ్బయ్యను నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన YS జగన్‌కు జిల్లా వైసీపీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
CTR: శాంతిపురం మండల పరిధి పెద్దూరు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో పీఈఎస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పీఆర్‌వోలు వెంకటేష్, చంద్ర తెలిపారు. ఈ శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు చేపట్టి అవసరమైన వారికి మందులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం నిర్వహించనున్న ‘గ్రామీణ డాక్ సేవక్’ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన తపాలశాఖ ఉద్యోగులను సీఎం సన్మానించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి సింధియా కూడా హాజరుకానున్నారు.
NRPT: హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో నారాయణపేటకు చెందిన విద్యాశ్రీ రోయింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిందని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేశ్ తెలిపారు. అండర్-16 షాట్ పుట్ పోటీల్లో నర్మదా కాంస్య పతకం గెలుపొందిందన్నారు. ఇద్దరు క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమని, మునుముందు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు.
NLG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ బోర్డు పీడీ ఎస్పీ రాజ్ కుమార్ అన్నారు. శనివారం కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాల పనుల పురోగతిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మార్చి చివరి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
NRML: తానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి రూ.21 లక్షల నిధులు మంజూరైనట్లు MLA రామారావు పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్రశిక్షా అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసిందన్నారు. వీటితో విద్యార్థుల కోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఇంటిగ్రేటెడ్ సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను బాలీవుడ్‌ని వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. కొన్ని కారణాల వల్ల తనకు బాలీవుడ్‌లో పరిమితమైన అవకాశాలు వచ్చాయనే భావన కలిగినట్లు తెలిపింది. అలాంటి పరిస్థితుల్లోనే హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు పేర్కొంది. ఈ రెండు పరిశ్రమలలో పనిచేయడం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది.
కడప జిల్లాలో మాంసం ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ కిలో ధర రూ. 210 నుంచి రూ. 240 వరకు ఉండగా, మటన్ ధర కిలోకు రూ. 850గా కొనసాగుతోంది. చేపల ధరలు కిలోకు రూ. 100 నుంచి రూ. 300 వరకు ఉన్నాయి. ఆదివారం కావడంతో చికెన్ దుకాణాల వద్ద కొనుగోలుదారులు భారీగా తరలివచ్చారు. ధరలు పెరిగినా వినియోగదారుల రద్దీ మాత్రం తగ్గలేదు.
VSP: “నీతి ఆయోగ్” ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) బివీఆర్ సుబ్రహ్మణ్యం ఆదివారం ఉదయం విశాఖపట్నం రానున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొని, 23న ఉదయం తిరుగు పయనమవుతారన్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు గమనించాలని సూచించారు.
VKB: తాండూర్ ఎమ్మెల్యే నేడు జిణుగుర్తి గ్రామంలోని ఏకలవ్య గ్రామీణ్ వికాస్ ఫౌండేషన్ గురుకుల ఆవరణలో నిర్వహించనున్న నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ సభ్యులు హాజరుకానున్నారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కూడా పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.