సృజనాత్మక ఆలోచనలను మెరుగుపరుచుకోవడానికి మాతృభాషే కీలకమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాతృభాషను గౌరవించాలని పిలుపునిచ్చారు. ‘భారతీయ నాగరికతలో భాషాపరమైన గర్వం ఉంది. ప్రతి ఒక్కరూ భాషాభిమానాన్ని గౌరవంగా భావించాలి. మాతృభాష లోతైన అభ్యాసానికి ముఖ్యమైనది. మన భాషలు కేవలం కమ్యూనికేషన్ సాధనాలు కావు. అవి మన చరిత్రను, సంప్రదాయాన్ని, తరతరాల సామూహిక జ్ఞానాన్ని కాపాడుతాయి.’...
TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో సాధించిన విజయాలు, ఇటీవల నిర్వహించిన విజయోత్సవాల గురించి రాహుల్‌కు భట్టి వివరించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టులు, సమగ్ర ఇంటింటి సర్వే తదితర అంశాలపై ఇరు నాయకుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి.
భారత్ ప్రగతిని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు దేశ విదేశాల్లోనూ ఉన్నాయని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆరోపించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, సంస్థలను అవమానించేందుకు పక్కా ప్రణాళికతో ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలను కలిసికట్టుగా నిర్మూలించాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు.
TG: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. వారి డిమాండ్స్ ఒక్కొక్కటీ పరిష్కరించేందుకు తప్పకుండా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఆశా వర్కర్లు విపక్షాల కుట్రలో ఇరుక్కోవద్దని సూచించారు.
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఎడతెగని యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా ఉక్రెయిన్‌ను హెచ్చరించింది. రానున్న రోజుల్లో రష్యా మళ్లీ సరికొత్త మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉందని అమెరికా అధికారులు హెచ్చరించారు. కాగా, ఇటీవల రష్యా తన వద్ద ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వెల్...
AP: వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయడమే లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమార్ 90 దేశాలకు రాకపోకలు కొనసాగుతున్నాయని తెలిపారు. అప్పట్లో5000 ఎకరాలు భూమిని సేకరించడం సాధ్యం కాదన్నారు. కానీ చంద్రబాబు సాధ్యం చేసి చూపించారని కొనియాడారు. దేశంలో ఐటీ విప్లవం వెనుక చంద్రబాబు కృషి ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
AP: అమరావతిలో తొలిరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసింది. శాంతి భద్రతలపై సమీక్షను సీఎం చంద్రబాబు రేపటికి వాయిదా వేశారు. రేపు ఉదయం 9గంటలకు రెండో రోజు కలెక్టర్ల సమావేశం ప్రారంభం కానుంది. ఇవాళ జరిగన సదస్సులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్లను సీఎంం ఆదేశించారు. అవసరమైతే బియ్యం సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని సూచించారు.
AP: రేపు సుప్రీంకోర్టులో అమరావతిపై గత ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. అమరావతే ఏకైక రాజధాని అంటూ గతంలో హైకోర్టు విస్పష్ట తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ గత ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై రేపు విచారణ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నట్లు కూటమి ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అమరావతే ఏకైక రాజధాని అంటూ అఫిడవిట్‌లో స్పష...
AP: రేషన్ బియ్యం దొంగరవాణాపై కలెక్టర్లతో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమాలు జరిగేందుకు వీల్లేదని సీఎం హెచ్చరించారు. చెక్‌పోస్టులున్నా అక్రమ రవాణా ఎలా జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ ప్రశ్నించారు. 13 కేసుల్లో 86 రైస్ మిల్లులకు నోటీసుు జారీ చేశామని కలెక్టర్లు తెలిపారు. డైల్యుషన్ తక్కువ వల్ల పట్టుకోవటం కష్టంగా ఉందని కలెక్టర్లు చెప్పారు.
TG: విద్యతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని మంత్రి సీతక్క అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు నూతన పరిజ్ఞానంతో బోధన చేస్తే పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని వెల్లడించారు. అన్ని రంగాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం కేటాయించే నిధులు సరిపోతున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.
TG: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కుమార్తె వివాహానికి తెలంగాణ, త్రిపుర గవర్నర్లు హాజరయ్యారు. శంశాబాద్‌లోని జీఎంఆర్ ఎరీనాలో జరిగిన శాన్వితా రెడ్డి-రోహన్ రెడ్డిల వివాహ వేడుకకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు.
AP: ప్రజలు తినే బియ్యాన్ని చౌకదుకాణాల ద్వారా ఇవ్వడం లేదని మంత్రి పయ్యావులు కేశవ్ అన్నారు. రీసైక్లింగ్ బియ్యాన్ని ప్రభుత్వం, ఎఫ్‌సీఐ కొనాల్సి వస్తోందన్నారు. ప్రజలు తినే బియ్యం పండించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని తెలిపారు. చౌకబియ్యం స్మగ్లింగ్ అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని చెప్పారు.
చైనాలో ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ డబ్బు సంపాదన కోసం అడ్డదారి పట్టాడు. డెలివరీ బాయ్, సింగిల్ పేరెంట్‌గా నటిస్తూ ఆన్‌లైన్‌లో సానుభూతి పొందుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. చిన్నారితో కలిసి ఫుడ్ డెలివరీలు చేస్తూ.. తాను సింగిల్ పేరెంట్‌నని, పాప తల్లి ఆమెను వదిలేసిందని చెబుతూ వీడియోలు చేస్తున్నాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. అతడు చెబుతున్నవన్నీ కట్టుకథలేనని వెల్లడించారు. నిందితుడిని...
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమికి, మిత్రపక్షాల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై గౌరవం, నమ్మకంతో కూటమికి సారథ్యం వహించే విషయంలో తనకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలని.. ప్రజలు బాగుండాలని తాను నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానని.. కాబట్టి దాన్ని సరిగ్గా నడపాల్సిన బాధ్యత తనపై ఉందని దీదీ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలోనే మునుపటి కంటే దూకుడుగా వ్యవహరించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. తొలిరోజే 25 దస్త్రాలు.. ఇమిగ్రేషన్ నుంచి ఇంధనం వరకు కీలక అంశాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తన బృందానికి సూచనలు చేసినట్లు సమాచారం. జో బైడెన్.. తొలిరోజు 17 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్...