• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

KMR: బీర్కూర్ మండలం చించోలి గ్రామంలో బుధవారం బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. బాల్య వివాహం వల్ల కలిగే అనర్ధాలను ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీడీపీవో సౌభాగ్య, సూపర్ వైజర్ సుమలత పాల్గొన్నారు.

December 11, 2024 / 02:41 PM IST

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్

JGL: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఏ విధంగా సర్వే చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అయన వెంట ఆర్డీవో దివాకర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారులు చిన్నయ్య, రాజేశ్వర్, తహశీల్దార్ వినోద్, ఎంపీడీవో శంకర్ పాల్గొన్నారు.

December 11, 2024 / 02:41 PM IST

బీజాపూర్‌ జిల్లాలో ఐఈడీ పేలుడు

ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్‌ జిల్లాలో ఐఈడీ పేలుడు సంభవించింది. గంగలూరు పరిధిలోని మూంగా ప్రాంతంలో ఐఈడీ పేలడంతో ఇద్దరు డీఆర్‌జీ సైనికులకు గాయాలయ్యాయి. గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం బీజాపూర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

December 11, 2024 / 02:40 PM IST

‘అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబు చూపించారు’

AP: అభివృద్ధి పాలన ఎలా ఉంటుందో ఈ ఆరు నెలల్లో సీఎం చంద్రబాబు చూపించారని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. గత ఐదేళ్లూ అరాచక పాలన నడించిదని విమర్శించారు. ఆర్థిక సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా రాష్ట్ర వెళ్తుందని అన్నారు. ప్రతి నెలా 1వ తేదీన 100 శాతం పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి, పోలవరాన్ని జగన్ గాలికి వదిలేశారని అన్నారు. స్కూళ్లలో నిర్వహించిన పీటీఎం సమావేశాలు చరిత్రలో నిలుస్త...

December 11, 2024 / 02:38 PM IST

తీలేరు స్టేజీ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం

NRPT: మరికల్ మండలంలోని తీలేరు స్టేజీ దగ్గర గుర్తు తెలియని మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని నారాయణపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే మరికల్ ఎస్సై రాముకు వివరాలు తెలపాలని కోరారు. మరింత సమాచారం కోసం మరికల్ పోలీస్ స్టేషన్ నంబర్‌ 8712670408లో సంప్రదించాలని కోరారు.

December 11, 2024 / 02:37 PM IST

‘ప్రభుత్వాలు మారిన ప్రజా సమస్యలు అలానే ఉన్నాయి’

BDK: ప్రభుత్వాలు మారిన ప్రజా సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని, ప్రజాస్వామ్య కోణానికి విరుద్ధంగా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం సింగరాయపాలెంలో జరిగిన సీపీఎం పార్టీ డివిజన్ మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రజల బతుకులు బాగుపడాలంటే పాలకుల ఆలోచన బాగుండాలని ఆయన పేర్కొన్నారు.

December 11, 2024 / 02:36 PM IST

పోలీస్ సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు

AKP: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బి.అప్పారావు ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఆసుపత్రి డీసీహెచ్ఎస్ ఎస్.శ్రీనివాసరావు సమక్షంలో వైద్య సిబ్బంది బీపీ, సుగర్, ఈసీబీ వంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

December 11, 2024 / 02:36 PM IST

మార్కెట్‌లో నిలకడగానే పత్తి ధర

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర నిన్నటి లాగానే నిలకడగా ఉంది. మంగళవారం రూ. 7,150 పలికిన పత్తిధర ఈరోజు కూడా అంతే పలికింది. బుధవారం యార్డుకు రైతులు 22 వాహనాల్లో 185 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,150, కనిష్ఠంగా రూ.6,700 పలికింది. ధరలో ఎలాంటి మార్పు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

December 11, 2024 / 02:36 PM IST

ఈ నెల 13న కళ్యాణోత్సవం

GDL: మల్దకల్ మండల కేంద్రంలోని స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ ఛైర్మన్ ప్రహ్లాదరావు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 13న కళ్యాణోత్సవం,14న తెప్పోత్సవం నిర్వహించనున్నామని, ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారని పేర్కొన్నారు.

December 11, 2024 / 02:35 PM IST

మూడు పూటలు అన్నం తింటున్నారా..?

మూడు పూటలు అన్నం తింటే పలు సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు వెల్లడించారు. వైట్ రైస్ ఎక్కువ తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. తద్వారా బరువు పెరుగుతారు. ఇలా తింటే ఊబకాయం బారిన పడటంతో పాటు, గుండెకు కూడా ప్రమాదమే. అందువల్ల అన్నం తగ్గించి దానికి బదులుగా చపాతీలు తినడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. వైట్ రైస్‌కు బదులు బ్రౌన్ లేదా రెడ్ రైస్ తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని అంటున్న...

December 11, 2024 / 02:35 PM IST

‘భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుంది’

MNCL: మత్తు పదార్థాలు సేవించడం వల్ల భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందని జన్నారం మండల రెండవ ఎస్సై తానాజీ అన్నారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని బుధవారం ఆయన విడుదల చేశారు. యువత బాగా చదువుకుంటూ క్రమశిక్షణతో జీవిత లక్ష్యాలను సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు ఉన్నారు.

December 11, 2024 / 02:34 PM IST

రాజమండ్రిలో సందడి చేసిన సినీ నటి శ్రీలీల

E.G: రాజమండ్రిలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. నగరంలోని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అభిమానులు భారీగా తరలివచ్చారు.

December 11, 2024 / 02:33 PM IST

చెట్టును ఢీకొన్న ఆటో.. నలుగురికి గాయాలు

MDK: ఆందోల్ మండలం అన్నాసాగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రిక్షా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు డాకూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 11, 2024 / 02:32 PM IST

ఆర్మూర్‌కు చేరిన మహా పాదయాత్ర

NZB: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గురు స్వామి బాలకృష్ణ చేపట్టిన గోమాత మహాపాదయాత్ర బుధవారం ఆర్మూర్ పట్టణానికి చేరుకుంది. అయ్యప్ప స్వాములు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన ధర్మాన్ని కాపాడుకోవాలని, గోమాతను రక్షించుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో గురుస్వామి నగేష్ శర్మ, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

December 11, 2024 / 02:32 PM IST

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే బీవీ

KRNL: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలు క్షేమంగా ఉంటారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలోని ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ఎమ్మెల్యే ప్రారంభించారు. డాక్టర్ అరుణ్ కుందవరం ఆధ్వర్యంలో 180 మంది మున్సిపల్ సిబ్బందికి ఉచితంగా హోమియో మందులు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

December 11, 2024 / 02:32 PM IST