• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

IND(w) vs AUS(w): భారత్ ముందు భారీ లక్ష్యం

పెర్త్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 298 పరుగులు చేసింది. ఆరంభంలో తడబడినప్పటికీ.. చివరికి సదర్‌లాండ్ అద్భుత సెంచరీ(110)తో జట్టుకు భారీ స్కోర్‌ను అందించింది. గార్డ్‌నర్, మెక్‌గ్రాత్ ఆఫ్ సెంచరీలతో రాణించారు. భారత్ బౌలర్లలో అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీయగా, దీప్తీ 1 వికెట్...

December 11, 2024 / 02:08 PM IST

రేగాటిపల్లిలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం

సత్యసాయి: ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

December 11, 2024 / 02:07 PM IST

నీటిని విడుదల చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే

ATP: బుక్కపట్నం చెరువు కట్ట కింద ఆయకట్టు భూములకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర నీటిని విడుదల చేశారు. కొత్తచెరువు ప్రాంతంలోని భూములకు సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు నీటిని విడుదల చేశారు.

December 11, 2024 / 02:05 PM IST

పంటలను పరిశీలించిన అంబటి రాంబాబు

GNTR: వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్ ఆదేశాల మేరకు రైతుల సమస్యలు, ధాన్యం సేకరణపై గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల తరఫున నినదించే కార్యక్రమం బుధవారం మేడికొండూరు మండలంలోని జంగంగుంట్లపాలెం గ్రామంలో నిర్వహించారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

December 11, 2024 / 02:04 PM IST

మాజీమంత్రి పేర్నినాని సతీమణిపై కేసు నమోదు

AP: రేషన్ బియ్యం అక్రమాలపై మాజీమంత్రి పేర్నినాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది. పౌరసరఫరాలశాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు జయసుధపై బందరు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. వైసీపీ హయాంలో జయసుధ పేరిట నాని గిడ్డంగి నిర్మించారు. ఇటీవల ఆ గిడ్డంగిని తనిఖీ చేసిన అధికారులు.. బియ్యం నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించారు. 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు తేల్చారు. 

December 11, 2024 / 02:01 PM IST

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంట: ఎర్రబెల్లి

WGL: పార్టీ కార్యకర్త చనిపోతే వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల కేంద్రానికి చెందిన ఎండీ మనసుర్ అనే బీఆర్ఎస్ కార్యకర్త ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించగా పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు.

December 11, 2024 / 02:00 PM IST

సాగునీటి సంఘాల నోటిఫికేషన్ విడుదల

NLR: సంగం మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో బుధవారం సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ను తహసీల్దార్ సోమ్లా నాయక్, నోడల్ అధికారి వినయ్ కుమార్ విడుదల చేశారు. 14వ తేదిన సాగునీటి సంఘం ఎన్నికలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమర్థవంతంగా నిర్వహిస్తామని తహసీల్దార్ చెప్పారు.

December 11, 2024 / 01:57 PM IST

పుంగనూరులో విద్యుత్ శాఖ డివిజన్ స్థాయి సమావేశం

CTR: పుంగనూరులో బుధవారం విద్యుత్ శాఖ డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. చిత్తూరు జిల్లా ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ హాజరయ్యారు. విద్యుత్ శాఖ తరఫున జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. అలాగే బకాయల పురోగతిపై ఆరా తీశారు. వినియోగదారులకు-నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. EEలు శ్రీనివాసమూర్తి, ఏడీలు పాల్గొన్నారు.

December 11, 2024 / 01:54 PM IST

కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ధర్నా

NZB: కొత్త రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని ప్రజలు బుధవారం పోతంగల్ మండల కేంద్రంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్థులు బజరంగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం లేదన్నారు. వెంటనే స్పందించి కొత్త కార్డులను జారే చేయాలని కోరారు. అలాగే మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలన్నారు.

December 11, 2024 / 01:53 PM IST

అంబేద్కర్‌ను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

NLG: మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో అంబేద్కర్ విగ్రహాన్ని దూషిస్తూ హేళన చేస్తూ వీడియో తీసి వాట్సాప్‌లో పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బుధవారం కొండమల్లేపల్లి ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ కన్వీనర్ జిల్లా రాములు మాట్లాడుతూ.. అంబేద్కర్ అవమానించిన వ్యక్తిపై రాజద్రోహం కేసు పెట్టాలన్నారు.

December 11, 2024 / 01:53 PM IST

పాచిగుంటలో యువతి అదృశ్యం

CTR: యాదమరి మండలం పాచిగుంటకు చెందిన యువతి అదృశ్యమైంది. కుటుంబసభ్యులు చుట్టు పక్కల ఎంత వెతికిన యువతి ఆచూకీ లభించలేదు. ఈ మేరకు ఇవాళ ఉదయం గ్రామ సమీపంలోని బావి వద్ద యువతి చెప్పులు, చున్నీని స్థానికులు గుర్తించారు. పోలీసుల సమక్షంలో గ్రామస్తులు మోటర్‌లతో నీటిని బయటకు పంపుతున్నారు. 

December 11, 2024 / 01:52 PM IST

రేవతి మృతితో మాకేం సంబంధం: సంధ్య థియేటర్ ఓనర్

పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చింది. పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారు. అయినా మా బాధ్యతగా బందోబస్తు కల్పించాం. అలాంటి మాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం’ అని అన్నారు.

December 11, 2024 / 01:52 PM IST

కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్

ATP: విజయవాడలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. సమావేశంలో వివిధ అంశాలపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమం రేపు కూడా కొనసాగనుంది.

December 11, 2024 / 01:52 PM IST

ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఆర్డీఓ

PLD: నూజెండ్ల మండలంలో బుధవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మండలంలోని ముక్కెళ్లపాడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో నరసరావుపేట ఆర్డీఓ మధులత పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను ఆర్డీఓ స్వీకరించారు. వారి సమస్యలను పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

December 11, 2024 / 01:50 PM IST

విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ

PLD: పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని గురజాల డీఎస్పీ జగదీష్ అన్నారు. బుధవారం కారంపూడి పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. లాకప్‌లను, రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఎస్సై వాసుకు సూచించారు.

December 11, 2024 / 01:45 PM IST