CTR: బంగారుపాళ్యం మండలంలోని పాలేరు, బలిజపల్లి గ్రామాల్లో ఈ రోజు తెల్లవారుజామున పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో సిబ్బంది ట్రబుల్ మాంగర్స్, NDPS అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాలు, ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని అనుమానితులను కఠినంగా హెచ్చరించారు.