PDPL: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే రైతు ఉత్సవాలకు పాలకుర్తి మండలానికి చెందిన రైతులు 2 ప్రత్యేక బస్సులలో బయలుదేరినట్లు AO బండి ప్రమోద్ కుమార్ తెలిపారు. మండలంలోని సుమారు 60 మంది రైతులు, అభ్యుదయ రైతులు రైతు మేళాకు తరలి వెళ్లారు. ఆధునిక వ్యవసాయ సాగు విధానాలపై శాస్త్రవేత్తలు రైతు మేళాలో అవగాహన కల్పించనున్నట్లు AO తెలిపారు.
TPT: ఎర్పేడు మండలం వికృతమాల గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తగా, దీనిని తెలుగు యువత అధ్యక్షులు పూల హేమాక్షి రాయల్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి గంటలోపే నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. దీంతో సంబంధిత అధికారులు తెలుగు గంగ పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేశారు.
JN: జనగణన ప్రక్రియలో అన్ని వివరాలు కచ్చితత్వంతో ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనగణన-2027 ఫేస్-1గృహ గణన నిర్వహణపై టెక్నికల్ అసిస్టెంట్లు, ఛార్జ్ క్లర్క్‌లకు ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు. సాంకేతిక పరికరాల వినియోగంతో డేటా సేకరణలో పారదర్శకత ఉండాలని ఆదేశించారు.
KMM: సత్తుపల్లి మండలం నారాయణపురం వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆదివారం పరామర్శించారు.పెనుబల్లి మండలం మండాలపాడుకు చెందిన మృతుడు పానెం సులోమాన్ నివాసానికి వెళ్లిన ఆయన సులోమాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
KMR: దోమకొండ మండలం చింతామణిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆడుకుంటున్న హర్షిని, జాహ్నవి అనే ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారులు గాయపడ్డారు. వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హర్షినికి కంటి వద్ద తీవ్ర గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
NRPT: ఉట్కూర్ మండలం పెద్ద జెట్రం గ్రామంలో సంక్షేమ పథకాల పంపిణీపై వివాదం నెలకొంది. సర్పంచ్ వాకిటి వెంకటేష్‌కు సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు పథకాలు అందించడాన్ని ఉప సర్పంచ్ స్వాతి పవన్ ఖండించారు. రంజాన్ తోఫాలు, క్రీడా కిట్ల పంపిణీని పార్టీ తరఫున నిర్వహించడం సరైంది కాదని ఆమె అన్నారు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ రెండు రోజుల విరామం అనంతరం సోమవారం పున: ప్రారంభం కానుంది. నిన్న రంజాన్, ఈరోజు వారాంతపు సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉ.6 గంటల నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ రెండు రోజుల విరామం అనంతరం సోమవారం పున: ప్రారంభం కానుంది. నిన్న రంజాన్, ఈరోజు వారాంతపు సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉ.6 గంటల నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
ADB: గుడిహాత్నూర్ మండలంలోని దొంగర్గావ్ గ్రామ సర్పంచ్ ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రంజాన్ (ఇద్) విందులో బోథ్ MLA అనిల్ జాదవ్ పాల్గొన్నారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా పండుగలను నిర్వహించుకోవడం గొప్ప విషయమని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల BRS నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
NZB: మాదకద్రవ్యాల మహమ్మారిని జిల్లా నుంచి తరిమికొట్టేందుకు ప్రజలందరూ పోలీసులతో కలిసి నడవాలని సీపీ సాయి చైతన్య పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడకం లేదా విక్రయాల గురించి మీ చుట్టుపక్కల ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.
SRPT: ఆద్య పాలకుడు శాలివాహన చక్రవర్తి జయంతిని ఈరోజు పెన్ పహాడ్ మండల కేంద్రంలో కుమ్మర సంఘం నాయకులు జయరామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శాలివాహన మొట్టమొదటి తెలుగు చక్రవర్తి అని వారు తెలిపారు. కుమ్మరుల ఆర్థిక, విద్యా, వైద్య అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటును అందించాలన్నారు.
TG: సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టకు సీఎం రేవంత్ చేరుకున్నారు. టీజీ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని పరిశీలించిన అనంతరం కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్‌ను రైతులకు అంకితమిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
నల్లగొండ క్యాంపు కార్యాలయంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన రూ.19 లక్షల విలువగల చెక్కులను 48 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్రాభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు సీఎం నేతృత్వంలో అమలు అవుతున్నాయని చెప్పారు.
NRML: కుబీర్ మండలంలోని సోమేశ్వర్, బ్రాహ్మశ్వర్ గ్రామాలకు రూ. 8 లక్షలు, మార్లగొండ పంచాయతీ అనుబంధ గ్రామాలకు రూ. 21 లక్షలు, సేవాదాస్ నగరానికి రూ. 3 లక్షలు సీసీ, డ్రైనేజ్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందజేశారు. గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ధన్యవాదాలు తెలిపారు.
సత్యసాయి: కనగానపల్లి మండలంలో హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా కనగానపల్లి హెడ్ క్వార్టర్ వద్ద రూ.80 లక్షల ఎంపీ నిధులతో నిర్మిస్తున్న శ్రీ భక్త కనకదాస కళ్యాణ మండప నిర్మాణ పనులను ఎంపీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ పోతులయ్య, డీఈ లక్ష్మీనారాయణ, కనగానపల్లి ఎంపీటీసీ భాస్కర్, గ్రామస్థులు పాల్గొన్నారు.