• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

15వ వార్డులో నీటి ఎద్దడి.. ట్యాంకర్లతో సరఫరా

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో తలెత్తిన త్రాగునీటి సమస్యను కౌన్సిలర్ భవాని పరిష్కరించారు. వార్డులో నీటి కొరత ఉందన్న ప్రజల విన్నపంపై ఆమె తక్షణమే స్పందించి, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డు సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని వార్డు ప్రజలకు కౌన్సిలర్ పిలుపునిచ్చినారు.

March 22, 2026 / 03:01 PM IST

బొత్సను పరామర్శించిన ఎమ్మెల్సీ తోట

కోనసీమ: వైసీపీ రాష్ట్ర రీజనల్ కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఆదివారం మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పరామర్శించారు. బొత్స ఇటీవల అస్వస్థతకు గురై చికిత్స అనంతరం విజయనగరంలోని ఆయన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలాని ఆకాక్షించారు.

March 22, 2026 / 03:00 PM IST

లారీ అసోసియేషన్ సమావేశంలో మంత్రి స్వామి

ప్రకాశం: టంగుటూరులో ఆదివారం జరిగిన లారీ అసోసియేషన్ సమావేశానికి మంత్రి స్వామి హాజరయ్యారు. ట్యాక్స్‌ను చెల్లింపు, ఆర్టీఏ నిబంధనలతో తీవ్రంగా నష్టపోతున్నామని సరైన వ్యాపారాలు లేక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నామని లారీ అసోసియేషన్ సభ్యులు మంత్రికి తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి, తన వంతు సహాయం చేస్తానని అసోసియేషన్ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు.

March 22, 2026 / 03:00 PM IST

బాధిత కుటుంబానికి భీమా అందజేత

GNTR: పినపాడు గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు కొండ్రు సాయి కుమార్ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. జనసేన పార్టీ తరఫున రూ.5,00,000 ప్రమాద బీమా పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

March 22, 2026 / 03:00 PM IST

అనిగండ్లపాడులో పైప్ లైన్ పగిలి వృధాగా పోతున్న నీరు

NTR: పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు పెట్రోల్ బంక్ సమీపంలోని పంట కాలువ వద్ద ఆదివారం మంచినీటి పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతుందని స్థానికులు తెలిపారు. వేసవికాలంలో సమీపిస్తున్న సమయంలో ఎలా నీళ్లు వృధాగా పోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

March 22, 2026 / 03:00 PM IST

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

JGL: ఇబ్రహీంపట్నం మండలం భర్తీ పూర్ గ్రామంలో గోదావరి నదిలో చేపలు పట్టడానికి వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన చెట్టి వెంకటేశ్(25) గ్రామ శివారులోని గోదావరి నదిలో చేపలు పట్టడానికి శనివారం వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. ఇవాళ ఉదయం గాలించగా మృతదేహంను కనుగొని బయటకు తీశారు.

March 22, 2026 / 02:58 PM IST

‘రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి’

PPM: అకాల వర్షాలు కారణంగా నష్ట పోయిన మొక్కజొన్న రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సీపీఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేసారు. ఆదివారం పాచిపెంట(మం) పాంచాలి, మోసురు, మాతుమూరు గ్రామాలలో నేలకొరిగిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఎకరాకు రూ. 40 వేలు పెట్టుబడి పెట్టి, పంట చేతికి వచ్చే సమయంలో వడగళ్ళు వర్షం వలన పూర్తిగా నష్ట పోయారన్నారు.

March 22, 2026 / 02:57 PM IST

కల్తీ పాలు ఘటన… మరొకరు మృతి

E.G: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగేశ్వరావు (72) తాజాగా మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 16కు చేరింది. కల్తీ పాలు తాగడంతో ఆయన రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు కొండబాబు (64) అనే వ్యక్తి మాత్రమే కోలుకున్నారు. పాలను నిల్వ చేసే ఫ్రీజర్‌లో ఇథిలీన్ గ్లైకాల్ కలవడంతోనే ఈ ఘోరం జరిగింది.

March 22, 2026 / 02:56 PM IST

సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి: ఎమ్మెల్సీ

SRD: నాగులపల్లిలో బీజేపీ నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 శిబిరంలో ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కార్యకర్తలు క్రమశిక్షణతో ప్రజాసేవలో నిమగ్నం కావాలని సూచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదుగుతోందని పేర్కొన్నారు.

March 22, 2026 / 02:55 PM IST

చిరిగిన టెంట్ కింద ‘అన్నపూర్ణ’..!

MBNR: జిల్లా కేంద్రంలో పేదల ఆకలి తీర్చే అన్నపూర్ణ పథకం నిర్వహణ అత్యంత దీనస్థితికి చేరుకుంది. గతంలో గదిలో వడ్డించే ఆహారాన్ని, ఇప్పుడు గది లేకపోవడంతో రోడ్డు పక్కనే చిరిగిన టెంట్ కింద వడ్డిస్తున్నారు. ఎండ తీవ్రతకు టెంట్ ముక్కలైపోవడంతో భోజనం చేసే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి గదిని ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

March 22, 2026 / 02:54 PM IST

పక్షులకు త్రాగునీరు ఏర్పాటు

విశాఖలో గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా, దేవాలయాల్లో పక్షులకు ధాన్యం కుంచులు, తాగునీటి పాత్రలు, గూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా, విద్యార్థులతో విభిన్న ప్రాంతాలలో కొండల మీద, సముద్ర తీరంలో మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ చల్లడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

March 22, 2026 / 02:54 PM IST

గ్రామాల అభివృద్ధిలో వార్డ్ సభ్యులు కీలకం: ఎంపీడీవో

GDWL: గ్రామాల సమగ్ర అభివృద్ధిలో వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలని ఇటిక్యాల ఎంపీడీవో అజర్ మోహియిద్దీన్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి వార్డు సభ్యులు కృషి చేయాలని, పంచాయతీల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

March 22, 2026 / 02:54 PM IST

మోత్కూరు మండలంలో అకాల వర్షం… అపార నష్టం.

BHNG: మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో శనివారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన ఆకాల వర్షానికి అదే గ్రామానికి కొంపల్లి అంజయ్యకు చెందిన మూడు ఎకరాల యాసంగి వరి పంట నేల కొరిగింది. చేతికి వచ్చిన యాసంగి పంట ఆకాల వర్షంతో లక్షలు పెట్టుబడి పెట్టి పంట కోసే సమయానికి పొలం నెలకొరడంతో రైతు అంజయ్య కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

March 22, 2026 / 02:49 PM IST

మూసీ వివాదంపై బీజేపీ నేతల భేటీ

TG: మూసీ పునరుజ్జీవం – వాస్తవాలు అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో బీజేపీ చర్చా కార్యక్రమం నిర్వహించింది. మూసీ పునరుజ్జీవం పేరిట ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. పర్యావరణ ప్రభావాలు, మౌలిక సదుపాయాల కల్పన అంశాలపై మాట్లాడారు.

March 22, 2026 / 02:48 PM IST

పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద భారీ పోలీసు బందోబస్తు

SDPT: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నర్మెట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీకి వెళ్లే దారుల్లో 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కేవలం పాస్‌లు ఉన్న వారిని మాత్రమే స్టాళ్ల వద్దకు అనుమతిస్తున్నారు. సభకు వచ్చే రైతులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు.

March 22, 2026 / 02:46 PM IST