• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రూ.488 కోట్ల వ్యయంతో అతిపెద్ద ఇంటర్‌చేంజ్..!

HYD: పారిశ్రామిక పార్కులతో ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేయడానికి HMDA అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు. రాజేంద్రనగర్ బుద్వేల్ సమీపంలోని ఓఆర్ఆర్ పై రూ.488 కోట్ల వ్యయంతో అతిపెద్ద ఇంటర్‌చేంజ్ నిర్మాణానికి HMDA సిద్ధమైంది. అధికారిక యంత్రాంగం దీనికోసం విస్తృతంగా కృషి చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది.

March 22, 2026 / 01:17 PM IST

కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు పరిశీలన

WGL: గీసుగొండ మండలంలోని గరీబ్ నగర్‌లో రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను చేపట్టారు. GWMC 16వ కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ ఆదివారం ఈ పనులను పరిశీలించారు. పనులను వీలైనంత త్వరగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

March 22, 2026 / 01:17 PM IST

రామప్పలో అద్భుత దృశ్యం..!

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ప్రసిద్ధ రామప్ప దేవాలయం శిఖరంపై ఉన్న కలశాన్ని తాకుతూ ఉదయించే సూర్యుడు అపూర్వ దృశ్యాన్ని సృష్టించాడు. ఆ క్షణాన్ని ప్రధాన అర్చకుడు హరీశ్ శర్మ తన చరవాణిలో బంధించారు. భానుడి కిరణాలు ఆలయ శిల్ప సౌందర్యాన్ని మరింత ప్రతిబింబింపజేస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

March 22, 2026 / 01:16 PM IST

TRP రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మల్లేశం గౌడ్

SRCL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బుర్ర మల్లేశం గౌడ్‌ను నియమిస్తూ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఉత్తర్వులు జారీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్‌కు చెందిన మల్లేశం గౌడ్ ప్రజా పోరాటాల ద్వారా చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర కార్యవర్గంలో ఆయనకు స్థానం కల్పించినట్లు అధ్యక్షులు వెల్లడించారు.

March 22, 2026 / 01:14 PM IST

కార్బన్ డై ఆక్సైడ్ భూగర్భంలో దాచొచ్చు..!

హైదరాబాద్ NGRI, IISER శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులపై కీలక పరిశోధనలు చేపట్టారు. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్‌ను భూగర్భంలో నిల్వ చేసే విధానంపై వివరించారు. సౌరాష్ట్ర, భోపాల్, ముంబై-పుణె-నాసిక్ కారిడార్ ప్రాంతాలు ఇందుకు అనుకూలమని గుర్తించారు. నిల్వ చేసిన CO₂ కొద్ది కాలంలోనే కార్బోనేట్ రాళ్లుగా మారుతుందన్నారు.

March 22, 2026 / 01:14 PM IST

ఈనెల 24న పట్టుబడిన వాహనాలకు వేలం

NLG: దేవరకొండలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గల ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఈనెల 24న వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు టూవీలర్ వాహనాలకు రూ.10 వేలు, ఫోర్ వీలర్‌కు రూ. 30 వేలు డిపాజిట్‌ను అదే రోజు ఉదయం 10 గంటల లోపు చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు.

March 22, 2026 / 01:14 PM IST

శనగల కొనుగోలు షురూ.. క్వింటా రూ.5,875

ADB: ఉట్నూరు మండలం శ్యాంపూర్ సహకార దాల్ మిల్లో ప్రభుత్వ శనగల మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ విశ్వనాధ్ ప్రారంభించారు. క్వింటా శనగలకు ప్రభుత్వం రూ.5,875 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. రైతులు తమ పంటను బాగా ఎండబెట్టి, శుభ్రపరిచి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ జయవంత్ రావు, తదితరులు పాల్గొన్నారు.

March 22, 2026 / 01:14 PM IST

వేగం కన్నా ప్రాణం ముఖ్యం: ట్రాఫిక్ ఎస్సై ఆరోన్

PKSM: మార్కాపురం ట్రాఫిక్ ఎస్సై ఆరోన్ వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ‘వేగం కన్నా ప్రాణం ముఖ్యం’ అని తెలిపారు. ఇవాళ దోర్నాల బస్టాండులో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించారు. కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. వాహనదారులు సిగ్నల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు..

March 22, 2026 / 01:13 PM IST

ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR : నందిగామ పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధన సంస్థ వారికి కృతజ్జతలు తెలిపారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

March 22, 2026 / 01:13 PM IST

‘ప్రతి బొట్టు ఒడిసి పడదాం’

NLR: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గ్రంథాలయ పాలనాధికారి ఏ. నరసింహారావు అన్నారు. బుచ్చి శాఖ గ్రంధాలయంలో ఆదివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నీటి పొదుపు నినాదంగా కాకుండా విధానంగా మారాలన్నారు. నీటి సంరక్షణపై బాల్యంలోనే పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని కోరారు.

March 22, 2026 / 01:13 PM IST

గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ ఛైర్మన్

RR: చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం, చందనవెల్లి గ్రామంలో తలారి లక్ష్మమ్మకి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ మేరకు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం న్యూ కాలనీలోని రోడ్డును ప్రారంభించారు.

March 22, 2026 / 01:12 PM IST

‘యుద్ధ నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి’

AKP: ప్రపంచ దేశాలు యుద్ధ నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఆదివారం రాంబిల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల్లో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపాయి. సీఐటీయూ జిల్లా కార్యదర్శి దేవుడు నాయుడు మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా ఆయిల్, గ్యాస్, నిత్యవసర వస్తువులు ధరలు పెరగడంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.

March 22, 2026 / 01:10 PM IST

‘భూగర్భజలాలు పరిరక్షణ మనందరి బాధ్యత’

SKLM: భూగర్భజలాలు పరిరక్షణ మనందరి బాధ్యతని భూగర్భజల శాఖ సహాయ సంచాలకులు(RTD) దుప్పల లక్ష్మణరావు అన్నారు. ప్రపంచ జలదినోత్సవ వేడుకలు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏజీవి అయినా సజీవంగా జీవించాలంటే జలమే ఆధారమని, ప్రతీఒక్కరూ జలసంరక్షణకు శక్తివంచన లేకుండా పాటుపడాలన్నారు. నీటిని దుర్వినియోగంచేస్తే భవిష్యత్ తరాలకు నీరుండదన్నారు.

March 22, 2026 / 01:10 PM IST

తెనాలిలో ప్రముఖులకు ‘కీర్తి కిరీటం’సత్కారం

GNTR: తెనాలి రత్నా కళ్యాణ మండపంలో ఈ నెల 31న ‘మా-ఏపీ’ ఆధ్వర్యంలో ఉగాది పురస్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘అష్ట దిగ్గజాలకు కీర్తి కిరీటం’ పేరిట వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులను సత్కరించనున్నారని దర్శకుడు దిలీప్ రాజ తెలిపారు. కలెక్టర్ అన్సారియా ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ సహా పలువురికి పురస్కారాలు అందజేయనున్నారు.

March 22, 2026 / 01:10 PM IST

ఈ నెల 24న బియ్యం, బేడల వేలం పాట

ATP: పెద్దపప్పూరు మండల కేంద్రంలో మాఘమాసంలో జరిగిన తిరుణాల సందర్భంగా భక్తులు స్వామి వారికి సమర్పించిన బియ్యం, బేడల వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం ఆదివారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 24న స్వామివారికి సమర్పించిన బియ్యం, బేడలు, ఆలయ భూముల కౌలు వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ వేలం పాటలో పాల్గొనవచ్చు పేర్కొన్నారు. 

March 22, 2026 / 01:10 PM IST